Nayanthara Kavin Movie :కోలీవుడ్ స్టార్ హీరోయిన్, లేడీ సూపర్‌స్టార్ నయనతారా తాజాగా తన్ అప్‌కమింగ్ మూవీ గురించి డిఫరెంట్‌గా అనౌన్స్ చేసింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వింటేజ్ ఫొటోను షేర్ చేసి హాయ్ అంటూ రాసుకొచ్చింది. అందులో యంగ్ హీరో కవిన్ కనిపించి ఆకట్టుకున్నారు. దీంతో ఈ కాంబోలో సినిమా రానున్నట్లు అఫీషియల్‌గా కన్ఫార్మ్ అయిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఇంకేం అనౌన్స్మెంట్స్ చేయలేదు.
అయితే పోస్టర్ చూస్తుంటే మాత్రం ఇదో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని అర్థమవుతోంది. దీంతో అభిమానుల్లో మరింత ఎగ్జైట్మెంట్ పెరిగిపోయింది. 'లియో' లాంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన సెవెన్ స్క్రీన్ స్టూడియో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. విష్ణు ఇడవన్ ఈ సినిమాతో డైరెక్టర్‌గా డెబ్యూ చేయనున్నారు.
మరోవైపు ఈ సినిమాలోని నయన్ పాత్ర గురించి సోషల్ మీడియాలో పలు రూమర్స్ ట్రెండ్ అవుతున్నాయి. కథ పరంగా నయన్ ఈ మూవీలో హీరోకంటే పెద్ద వయసు అమ్మాయిగా కనిపించనుందట. అంతేకాకుండా తనకంటే చిన్నవాడైన హీరోను లవ్ చేస్తుందట. కాన్సెప్ట్ కాస్త ఇంట్రెస్టింగ్గా ఉండటం వల్ల నయన్ ఈ మూవీకి ఓకె చెప్పినట్లు సమాచారం.