తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ధనుశ్​తో కాంట్రవర్సీ - చిరు,చరణ్​,షారుక్​కు థ్యాంక్స్​ చెప్పిన నయనతార - NAYANTHARA DHANUSH CONTROVERSY

చిరంజీవి,చరణ్​,షారుక్​కు కృతజ్ఞతలు తెలిపిన హీరోయిన్ నయనతార.

Nayanthara Thanks To Sharukh Chiranjeevi Ramcharan
Nayanthara Thanks To Sharukh Chiranjeevi Ramcharan (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2024, 11:02 AM IST

Nayanthara Thanks To Sharukh Chiranjeevi Ramcharan : రీసెంట్​గానే నయనతార డాక్యుమెంటరీ విషయం కాంట్రవర్సీగా మారిన సంగతి తెలిసిందే. ఈ నయనతార : బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌ అనే డాక్యుమెంటరీ విషయంలో హీరో ధనుశ్​ను విమర్శిస్తూ నయన్ మూడు పేజీలో బహిరంగ లేఖ రాశారు. అయితే ఇప్పుడు ఇదే విషయంలో మెగాస్టార్ చిరంజీవి, బాద్​షా షారుక్​ ఖాన్​కు కృతజ్ఞతలు తెలిపారు.

తన 20 ఏళ్ల కెరీర్‌లో అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ పోస్ట్‌ పెట్టారు నయన్. ఇందులో భాగంగానే బాలీవుడ్‌లో షారుక్‌, టాలీవుడ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్‌లకు కృతజ్ఞతలు చెప్పారు. తన డాక్యుమెంటరీ కోసం ఈ ముగ్గురిని సంప్రదించినప్పుడు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని పేర్కొన్నారు. కాగా, నయనతార పేర్కొన్న దర్శక నిర్మాతల్లో షారుక్​, చిరు, చరణ్​లతో పాటు పలువురు తెలుగు, మలయాళ, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు.

"నేను పని చేసిన ప్రతి సినిమాకు నా జీవితంలో ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. నా సినీ జర్నీ లెక్కలేనన్ని ఆనందకరమైన క్షణాలను ఇచ్చింది. ఇందులో చాలా చిత్రాలు నా మనసుకు దగ్గరైయ్యాయి. ఆ జ్ఞాపకాలను, సీన్స్​ను మా డాక్యుమెంటరీలో చేర్చాలని నిర్మాతలను సంప్రదించినప్పుడు వారు కూడా ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వీరంతా నాకు అత్యంత విలువైన క్షణాలను కూడా అందించారు. అందుకే వీరందరిపై నాకెంతో గౌరవం ఉంది. నా జర్నీ ఇలానే కొనసాగుతుంది" అని తనకు సహకరించిన వారికి కృతజ్ఞతలు చెప్పారు.

కాగా, తన డాక్యుమెంటరీ విషయంలో హీరో ధనుష్‌ తీరును తప్పుబడుతూ నటి నయనతార రీసెంట్​గానే తీవ్ర విమర్శలు చేసింది. నానుమ్‌ రౌడీ దాన్‌కు సంబంధించిన మూడు సెకన్ల క్లిప్స్​ను డాక్యుమెంటరీ ట్రైలర్‌లో ఉపయోగించుకున్నందుకు రూ.10 కోట్లు నష్ట పరిహారంగా ధనుశ్​ డిమాండ్‌ చేశారని ఆమె ఆరోపించింది. ఈ మేరకు లీగల్‌ నోటీసులు కూడా పంపించినట్లు చెప్పింది. దీంతో ఈ కామెంట్స్​ ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారి తీసింది. పలువురు ఆమెకు మద్దతుగా నిలిచారు. కానీ ధనుశ్ మాత్రం ఈ వ్యవహారంపై స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నయనతార మళ్లీ తన డాక్యుమెంటరీకి సహకరించిన వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పడం వల్ల మరోసారి ఈ కాంట్రవర్సీ అంశం తెరపైకి వచ్చింది.

హీరో ధనుశ్​పై నయనతార తీవ్ర విమర్శలు - బహిరంగ లేఖ విడుదల చేసిన లేడీ సూపర్ స్టార్

'అసలు అప్పుడు ఏం జరిగింది?' - నయన్, ధనుశ్ కాంట్రవర్సీ డాక్యుమెంటరీ రివ్యూ

ABOUT THE AUTHOR

...view details