తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

చిన్న సినిమాలతో భారీ సక్సెస్ - ఈ వారం థియేటర్లలో అదరగొట్టిన చిత్రాలివే! - Latest movies with low budget - LATEST MOVIES WITH LOW BUDGET

Latest movies with low budget : ఈ మధ్య కాలంలో స్టార్ హీరో సినిమాలకు ధీటుగా నిలుస్తున్నాయి చిన్న సినిమాలు. చిన్న బడ్జెట్‌తో రూపొందించిన సినిమాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అలా ఈ వారం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి సూపర్ హిట్​గా నిలిచిన ఆ చోటా సినిమాలేంటో చూసేద్దాం.

Latest movies with low budget
Latest movies with low budget (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Sep 17, 2024, 9:16 AM IST

Latest movies with low budget : చిన్న సినిమాలను ఓటీటీల్లో మాత్రమే రిలీజ్ చేసుకోవాలనే భ్రమ పొగొట్టేలా థియేటర్లలోనూ కాసుల వర్షం కురిపించి ఔరా అనిపిస్తున్నాయి కొన్ని చిత్రాలు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి పెద్ద సక్సెస్ సాధించి షాక్ అండ్ సర్​ప్రైజ్​ ఇస్తున్నాయి! ఈ మధ్య కాలంలో విడుదలైన పెద్ద పెద్ద హీరోల సినిమాల కన్నా మంచి పేరు, కలెక్షన్లు సాధించి సక్సెస్ టాక్‌తో దూసుకుపోతున్న చిన్న సినిమాలు కొన్నింటి గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

భారీ బడ్జెట్, బడా హీరోలు లేకున్నా మంచి కథ, కంటెంట్ ఉంటే చాలని నిరూపించుకునేందుకు ఈ రెండు నెలల్లో రిలీజ్ అయిన నాలుగు సినిమాలు చాలు. హీరో ఇమేజ్ ఉంటేనే సినిమా హిట్ అవుతుందని భ్రమను వదిలేసుకునేలా చేసిన తాజా చిత్రం 'కమిటీ కుర్రోళ్లు'. ఈ సినిమాలో నటీనటులంతా అంతా కొత్త వాళ్లే. చివరికి దర్శకుడు కూడా. నిహారిక కొణిదెల నిర్మాతగా ఈ చిత్రంతో యదు వంశీ దర్శకుడిగా పరిచయం అయ్యారు. పెద్ద సినిమాల తాకిడికి థియేటర్లు తక్కువే దొరికినా సూపర్ హిట్ టాక్ దక్కించుకుని మరీ శెభాష్ అనిపించుకుంది.

తర్వాత సినిమా 'ఆయ్'. రవితేజ(మిస్టర్​ బచ్చన్​), రామ్(డబుల్ ఇస్మార్ట్​) లాంటి స్టార్ హీరోల చిత్రాల కన్నా పెద్ద సక్సెస్ సాధించింది ఈ చిత్రం. అంజి కే మణిపుత్ర డైరక్షన్ సూపర్బ్‌గా ఉండటంతో మంచి హిట్ టాక్ దక్కించుకోవడమే కాకుండా నిర్మాతకు కాసుల వర్షం కురిపించింది.

ఇక రానా సమర్పణలో తెరకెక్కిన '35 చిన్న కథ కాదు' కూడా వసూళ్ల పరంగా గ్రేట్ అనిపించుకుంది. నివేథా థామస్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం క్రిటిక్స్ నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. ఇంకాస్త మార్కెటింగ్ చేసి ఉంటే పెద్ద సక్సెస్ కొట్టేదేమో అనే అభిప్రాయం అందరిలో కలిగించింది.

చివరిగా 'మత్తు వదలరా' సినిమాకు సీక్వెన్స్‌గా వచ్చిన 'మత్తు వదలరా 2'కూడా బాక్సాఫీసు రికార్డు బ్రేక్ చేసేలా కనిపిస్తుంది. ప్రభాస్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్​ చేయించుకుని, రాజమౌళితో ప్రమోషన్ చేయించుకున్న ఈ సినిమాకు ఓపెనింగ్స్ బాగానే దొరికాయి. ఊహించిన దాని కన్నా పెద్ద సక్సెస్ సాధించి థియేటర్లన్నీ హౌజ్ ఫుల్ అయిపోతున్నాయి. సత్య కామెడీ మీద సూపర్ పాజిటివ్ టాక్ రావడం సినిమాకు బాగా కలిసొచ్చి మైత్రి సంస్థకు లాభాలు కురిపిస్తోంది. ఫైనల్​గా సినిమా సక్సెస్ కావడానికి కారణం స్టార్ ఇమేజ్ ఉన్న హీరో కటౌట్‌లు కాదని మరోసారి నిరూపించాయి ఈ చోటా సినిమాలు.

'ఆ మూడు రోజులు నీళ్లు మాత్రమే తాగి' - మత్తు వదలరా 2 సత్య గురించి ఆసక్తికర విషయాలు - Mathu Vadalara 2 Comedian Satya

ఆ బ్లాక్ బస్టర్​ బాలీవుడ్ యాక్షన్​ మూవీలో విలన్​గా సూర్య! - నిజమెంత? - Suirya As Villian Bollywood Movie

ABOUT THE AUTHOR

...view details