Ram Charan Klin Kaara :గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ సతీమణి ఉపాసన తమ కుమార్తె క్లీంకార ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తరచూ షేర్ చేస్తుంటారు. ఫ్యామిలీ ఈవెంట్స్, ఫారిన్ ట్రిప్స్‌కు సంబంధించి ఆమె షేర్ చేసే ఫొటోల్లో చిన్నారి క్లీంకార అట్రాక్షన్‌గా నిలుస్తుంటుంది. తాజాగా క్లీంకార వీడియో ఒకటి ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో క్లీంకార నెటిజన్ల మది దోచేస్తుంది.
క్లీంకార డాడ్ మూమెంట్- TVలో నాన్నను చూసి మురిసిపోతుందిగా! - RAM CHARAN KLIN KAARA
నాన్నను తొలిసారి టీవీలో చూసిన క్లీంకార- వీడియో షేర్ చేసిన ఉపాసన
Published : Jan 4, 2025, 3:48 PM IST
వీడియోలో పాప, రామ్‌చరణ్ నటించిన 'ఆర్‌ఆర్‌ఆర్: బిహైండ్ అండ్ బియాండ్' వీక్షిస్తూ కనిపించింది. చరణ్ కనిపించగానే స్క్రీన్ వైపు చూపిస్తూ ముద్దుముద్దుగా మాట్లాడుతూ మురిసిపోతూ అలానే చూస్తూ ఉంది. తన తండ్రిని తొలిసారి టీవీలో చూసి క్లీంకార ఎంతో ఆనందం వ్యక్తం చేసిందని ఉపాసన పేర్కొన్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్ సినిమా మాకు ఎన్నోవిధాలుగా మధుర జ్ఞాపకాలు అందిస్తోంది. నాన్నను తొలిసారి టీవీలో చూసి క్లీంకార ఎంతో హ్యాపీగా ఫీలైంది. చరణ్ నీ విషయంలో ఎంతో సంతోషం, గర్వంగా ఉన్నా. 'గేమ్ ఛేంజర్' కోసం ఎదురుచూస్తున్నా అని ఉపాసన పేర్కొన్నారు.
కాగా, రామ్‌చరణ్- ఉపాసన దంపతులకు 2023 జూన్‌లో చిన్నారి క్లీంకార జన్మించింది. పాపకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా, అత్యంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇప్పటిదాకా నామకరణం, పండుగలు, ఫ్యామిలీ ఫంక్షన్స్ ఇలా అన్ని ఈవెంట్స్‌కు సంబంధించిన ఫొటోలు షేర్ చేసుకున్నప్పటికీ, పాప ముఖాన్ని మాత్రం ఇప్పటివరకూ చూపించడం లేదు.