Khatron Ke Khiladi 14 season : రెమ్యునరేషన్ తీసుకోవడంలో హీరోలు టాప్ ప్లేస్‌లో ఉంటారు. కానీ ఇప్పుడు హీరోలకు ఏమాత్రమూ తీసిపోమంటున్నారు డైరెక్టర్లు. స్టార్ హీరోలతో పోటీపడి మరీ భారీగా పారితోషికం తీసుకుంటున్నారు పలువురు దర్శకులు. తాజాగా ఓ హిందీ షో కోసం ప్రముఖ డైరెక్టర్ తీసుకోబుతున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుస్తే మీరు షాక్ అవ్వడం పక్కా.
ఇంతకీ ఆయన ఎవరంటే? బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి. ఈయనకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి పేరుంది. సూపర్ హిట్స్ సినిమాలను తెరకెక్కించిన ఈ డైరెక్టర్ ఇప్పుడు టీవీ రంగంలోనూ దూసుకుపోతున్నారు. అయితే టెలివిజన్ చరిత్రలో ఖత్రోన్ కె ఖిలాడీ పాపులర్ షోలలో ఒకటి. ఈ యాక్షన్ ప్యాక్డ్ షో ఇప్పటికే 13సీజన్లను పూర్తి చేసుకుంది. 14వ సీజన్ కోసం రెడీగా ఉంది. అయితే ఇప్పుడు ఈ షో గురించి ఓ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ రియాల్టీ షోను ఎప్పటి మాదిరిగానే స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి హోస్ట్ చేయబోతున్నారు. అయితే ఈ షోకు రోహిత్ శెట్టి భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. సీజన్ 14 కోసం ఏకంగా రూ. 16కోట్ల రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్నారని తెలిసింది.
గత సీజన్లో రోహిత్ శెట్టి ఒక్కో ఎపిసోడ్‌కు 50 లక్షలు వసూలు చేసినట్లు ఇంగ్లీష్ మీడియా కథనాలు కూడా చెబుతున్నాయి. ఒక ఎపిసోడ్‌ను హోస్ట్ చేయడానికి 50 లక్షలు నిజంగా చాలా పెద్ద మొత్తమే అని చెప్పవచ్చు. అయితే రోహిత్ శెట్టి ఇప్పుడు అంతకన్నా ఎక్కువ డబ్బు వసూలు చేయబోతున్నారట. ఈసారి ఒక్కో ఎపిసోడ్‌కు 60 నుండి 70 లక్షలు తీసుకోబోతున్నారని, అంటే మొత్తం సీజన్‌కు ఆయన ఫీజు దాదాపు 16 కోట్లు ఉంటుందని అంటున్నారు. ఇప్పటి వరకు టీవీ షోలను హోస్ట్ చేసిన వారెవరు కూడా ఇంత భారీ మొత్తంలో పారితోషికం తీసుకోలేదనే చెప్పాలి.