Srinidi Shetty:శ్రీనిధి శెట్టి సౌత్ఇండియాలో అప్పటివరకూ కనిపించని మొహం. కేజీఎఫ్ (KGF) సినిమాతో ఒక్కసారిగా తళుక్కుమంది. తొలి పార్ట్‌తో పాటు సీక్వెల్‌లోనూ ఆమెనే హీరోయిన్. సినిమా చూశాక, ఈ ఒక్క సినిమాతోనే కాదు మళ్లీ మళ్లీ చూడాలనిపించి ఆమె కోసం నెటిజన్లు వెతికేశారు నెటిజన్లు. అలా బ్యాక్‌గ్రౌండ్ గురించి ఎంక్వైరీ చేసి తాను ఒకప్పటి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అని తెలిసి నివ్వెరపోయారంతా! అంతేకాదు కన్నడ మూవీ కేజీఎఫ్‌తోనే సినిమా అరంగ్రేటం చేసిన శ్రీనిధి ప్రతిష్ఠాత్మకమైన 2016 మిస్ సూప్రానేషనల్ టైటిల్‌ను కూడా గెలుచుకుంది.
తులు భాష మాట్లాడే ఫ్యామిలీలో పుట్టిన శ్రీనిధి శెట్టి, చక్కటి ప్రోత్సాహకరమైన వాతావరణంలో పెరిగింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీరింగ్ కోర్సు చదువుకునేందుకు బెంగళూరు వెళ్లింది. కాలేజీలో చదువుతున్న సమయంలోనే ఎక్స్‌ట్రా యాక్టివిటీస్‌లో భాగంగా మోడలింగ్ మీద ఫోకస్ పెట్టింది. ఈ ఫీల్డ్‌లో పేరు తెచ్చుకునేందుకు లోకల్‌గా జరిగే చాలా అందాల పోటీల్లో పాల్గొంది. 2012లో జరిగిన అందాల పోటీల్లో ఆమె టాప్ ఫైనలిస్టుగా ఎంపిక అవగా ఆమె మోడలింగ్ కెరీర్ గ్రాండ్ లెవల్లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆమె మిస్ కర్నాటకతో పాటు పలు పేరున్న అవార్డులను సొంతం చేసుకుంది. ఇవే ఆమె కెరీర్‌కు చక్కటి పునాదిని వేశాయి.
చిన్నతనంలోనే తన తల్లిని కోల్పోయిన శ్రీనిధి ప్రతి పనిని ఆమెనే చేసుకునేది. అలా యాక్సెంచర్ (బెంగళూరు బ్రాంచ్)లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవగలిగింది. ఇంజినీరింగ్ కెరీర్ కంటిన్యూ చేస్తూనే మోడలింగ్‌లోనూ పాల్గొనేది. అలా 2018లో కేజీఎఫ్ చాప్టర్ 1లో యశ్ సరసన మెయిన్ క్యారెక్టర్ నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. ఆ సినిమాలో రీనా దేశాయ్ పాత్ర పోషించగా, సినిమా ఎంత సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ తర్వాత 2022లో కేజీఎఫ్ పార్ట్ 2లోనూ ఈమెనే హీరోయిన్. సీక్వెల్లో ఆమె పాత్రకు ఇంపార్టెన్స్ ఎక్కువ ఉండటంతో ప్రేక్షకుల నుంచి, ఇండస్ట్రీ నుంచి ప్రశంసలు అందుకుంది.