Keerthy Suresh Wedding Card : హీరోయిన్ కీర్తి సురేశ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. తన స్నేహితుడు ఆంటోనీతో ఆమె ఏడడుగులు వేయనున్నారు. ఈ నెల 12న వీరి వివాహం జరగనుంది. అయితే తాజాగా ఈమె పెళ్లి వేడుకకు సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ ఫొటో బయటకు వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
తాజాగా తన రిలేషన్షిప్ గురించి ఓపెనప్ అయ్యారు కీర్తి. ఆంటోతో ఆమె 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తన ప్రియుడితో ఆమె దిగిన ఓ స్పెషల్ ఫొటోను ఫ్యాన్స్ కోసం షేర్ చేశారు. దీనికి అభిమానులు, సినీ ప్రముఖులు రియాక్ట్ అయ్యారు. నెట్టింట ఈ జంటకు కంగ్రాజ్యూలేషన్స్ చెప్పారు.
గతంలోనూ ఆమె పెళ్లి గురించి రకరకాల రూమర్స్ వచ్చాయి. అయితే వాటిని ఆమెతో పాటు తన ఫ్యామిలీ ఖండించారు. ఆ తర్వాత ఆంటోనీ పేరు తెగ ట్రెండ్ అయ్యింది. తన స్నేహితుడితో ఆమె ఏడడుగులు వేయనున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోనూ ప్రచారం జరిగింది. ఇంజినీరింగ్ చదివిన ఆంటోనీ కొంతకాలం విదేశాల్లో ఉద్యోగం చేశారని, ప్రస్తుతం ఆయనకు కేరళలో బిజినెస్ చేస్తున్నారని టాక్ నడిచింది.