Karthi Mahesh Babu Movie :కోలీవుడ్ స్టార్ హీరో కార్తి, సీనియర్ నటుడు అరవింద స్వామి లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన లేటెస్ట్ ఎమోషనల్ మూవీ 'సత్యం సుందరం' బావా, బామ్మర్ది అనుబంధం నేపథ్యంలో సాగే ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ అందుకుని ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ టీమ్ ఓ సక్సెస్ ఈవెంట్ కూడా నిర్వహించింది. అందులో చిత్ర బృందం పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. అయితే మహేశ్ బాబుపై హీరో కార్తి చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
తాను మహేశ్ బాబు చిన్న వయసులో ఒకే క్లాస్‌లో చదువుకున్నామంటూ కార్తి చెప్పుకొచ్చారు. అవకాశం వస్తే ఆయన (మహేశ్)తో కలిసి తప్పకుండా నటిస్తానంటూ తెలిపారు. దానికి మంచి కథ కుదరాలని అన్నారు. ఈ మాటలు విని కోలీవుడ్ అలాగే టాలీవుడ్ ఆడియెన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఈ కాంబోలో ఓ సూపర్ సినిమా రావాలంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.
'సత్యం సుందరం' కథేంటంటే ?
సత్యమూర్తి అలియాస్ సత్యం(అరవింద్ స్వామి) గుంటూరు దగ్గరున్న ఉద్దండరాయుని పాలెంకు చెందిన వ్యక్తి. అతడికి ఆ ఊరు అన్నా అక్కడ ఉన్న తమ తాతల కాలం నాటి ఇళ్లంటే కూడా ఎంతో ఇష్టం. కానీ కొందరు బంధువులు చేసిన మోసంతో సత్యం యుక్తవయసులోనే అతడి కుటుంబం తమ ఇల్లును కోల్పోతుంది. దీంతో వాళ్లు ఆ ఊరుని వదిలేసి వైజాగ్ వెళ్లిపోతాడు. అలా 30ఏళ్లు కూడా గడిచిపోతాయి. అయితే ఇన్నేళ్లు గడిచినా సత్యంకు తన ఊరు, ఇంటి జ్ఞాపకాలు గుర్తుకొస్తూనే ఉంటాయి.