Kanguva First Single Released :తమిళ స్టార్ హీరో సూర్య త్వరలో 'కంగువ'గా అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. దసరా కానుకగా థియేటర్లలోకి ఈ సినిమా అక్టోబర్ 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. నేడు (జులై 23)న సూర్య బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది.
ముఖ్యంగా ఇందులోని విజువల్స్ అలాగే, యుద్ధ వీరుడిగా సూర్య మేకోవర్ పాటకే హైలైట్‌గా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో వచ్చిన ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి చక్కటి స్వరాన్నీ అందించారు. ఆర్ఆర్ఆర్ ఫేమ్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ఈ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు కొరియోగ్రాఫ్ చేశారు. 'ఆది జ్వాల, అనంత జ్వాల, వైర జ్వాల, వీర జ్వాల, దైవ జ్వాల, దావాగ్ని జ్వాల అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
Kanguva Movie Cast : కంగ అనే ఓ పరాక్రముడి కథ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో సూర్యతో పాటు దిశాపటానీ లీడ్ రోల్లో మెరవనున్నారు. పవర్ఫుల్ విలన్ రోల్లో బాలీవుడ్ స్టార్ బాబీ దేవోల్ కనిపించనున్నారు. వీరితో పాటు టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు, యోగిబాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. స్టూడియో గ్రీస్ సంస్థ బ్యానర్‌పై ఈ సినిమాను జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఇందులో హీరో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 38 బాషల్లో ఈ సినిమా విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.