తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆ డైరెక్టర్​కు షాక్​ - కమల్‌ హాసన్​ కొత్త ప్రాజెక్ట్​ ఆగినట్టేనా? - కమల్​ 233 ఆగిపోయిందా

Kamal Hassan 233 Project : అగ్ర నటుడు కమల్‌హాసన్‌ నటించనున్న 'కమల్‌ 233' ప్రాజెక్ట్​ ఆగినట్టేనా? అన్న ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ మూవీ నిర్మాణ సంస్థ చేసిన ఓ ట్వీట్ ద్వారా ఇది తెలుస్తోంది​. ఆ వివరాలు.

Kamal 233 Project Stopped
KH 233 Update

By ETV Bharat Telugu Team

Published : Jan 25, 2024, 4:03 PM IST

Updated : Jan 25, 2024, 4:37 PM IST

Kamal Hassan 233 Update : తమిళం, తెలుగు సహా వివిధ భాషల్లో నటించిన అగ్ర హీరోల్లో నటుడు కమల్​ హాసన్​ ఒకరు. త్వరలో ఈయన నటించనున్న 'కమల్‌ 233'(KH 233) ప్రాజెక్ట్​కు సంబంధించి నిర్మాణ సంస్థ చేసిన ఓ ట్వీట్​ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్​ అవుతోంది. దీని ప్రకారం కమల్​ ఈ ప్రాజెక్ట్​ చేయట్లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ట్వీట్​లో 'థగ్‌ లైఫ్‌', 'కమల్‌ 237', 'శివకార్తికేయన్‌ 21', 'శింబు 48' త్వరలో తమ బ్యానర్‌ నుంచి విడుదల కానున్నట్లు కమల్‌ హాసన్​కు చెందిన నిర్మాణసంస్థ రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌ రాసుకొచ్చింది. అయితే ఈ లిస్ట్​లో కమల్​ నటించనున్న 'కమల్‌ 233' ప్రాజెక్ట్‌ గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావన లేదు. దీంతో ఈ సినిమాను కమల్​ చేయడం లేదంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఇక ఈ గాసిప్స్​పై కమల్​ నుంచి నేరుగా కానీ, దర్శకుడు వినోద్​ నుంచి కానీ ఇప్పటివరకూ ఎలాంటి వివరణ రాలేదు.

కమల్​ కోసం పవర్​ఫుల్​ క్యారెక్టర్​ :'నేర్కొండ పార్వై', 'వలిమై', 'తునివు' చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న కోలీవుడ్‌ దర్శకుడు హెచ్‌. వినోద్‌. ఈయన రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై కమల్​ హాసన్​తో కలిసి ఓ ప్రాజెక్ట్​ చేయనున్నట్లు గతేడాది ప్రకటించారు. #KH233వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమాను ప్రారంభించినట్లు తెలిపారు. దీనికి సంబంధించి 'రైజ్‌ టు రూల్‌' పేరుతో ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ఈ వీడియో ఎంతో ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. ఇక కమల్‌కు ఉన్న క్రేజ్​ను దృష్టిలో ఉంచుకుని వినోద్‌ ఓ పవర్‌ఫుల్‌ పాత్రను రెడీ చేసినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఈ ప్రాజెక్ట్​ ఆగిపోయిందంటూ ఇటీవల జోరుగా ప్రచారం సాగింది. ఈ ప్రచారానికి బలాన్ని చేకూర్చేలా బుధవారం చిత్ర నిర్మాణ సంస్థ ఎక్స్​లో తమ బ్యానర్‌లో రానున్న చిత్రాల జాబితాను విడుదల చేసింది.

చిత్రీకరణ దశలో రెండు సినిమాలు :ఇకపోతే కమల్‌ హాసన్‌ ప్రస్తుతం ప్రభాస్ 'కల్కి'తో పాటు దర్శకుడు మణిరత్నంతోనూ చెరో సినిమా చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ప్రభాస్ సినిమాను వైజయంతీ మూవీస్ నిర్మిస్తుండగా - మణిరత్నం సినిమాను రాజ్‌ కమల్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌, మద్రాస్‌ టాకీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక కమల్ నటించిన ఇండియన్ 2 సినిమా రిలీజ్​కు రెడీగా ఉంది.

ఓవర్సీస్​లోనూ 'హనుమాన్' పైసా వసూల్- ఆరో సినిమాగా రికార్డ్​

'ప్రయాణం ఎప్పుడూ ఒకేలా ఉండదు- అది అదృష్టంగా భావిస్తా'

Last Updated : Jan 25, 2024, 4:37 PM IST

ABOUT THE AUTHOR

...view details