Kamal Haasan Indian 2 :లోకనాయకుడు కమల్‌హాసన్ ప్రస్తుతం 'ఇండియన్ 2' ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. ఇందు కోసం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్లోనూ మూవీటీమ్‌తో పాటు ప్రచారాన్ని జోరుగా చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా చెన్నై విలేకరులతో ముచ్చటించిన కమల్, సోషల్ మీడియాలో తన గురించి జరుగుతున్న ఓ చర్చపై స్పందించారు. 'ఇండియన్ 2' విషయంలో తాను చేసిన ఓ కామెంట్‌ను నెటిజన్లు మరోలా అర్థం చేసుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మాటలు అనడం వెనక వేరే ఉద్దేశం ఉందంటూ చెప్పుకొచ్చారు.
"నేను చెప్పిన విషయాన్ని కొందరు నెటిజన్లు మరోలా అర్థం చేసుకున్నారు. భారతీయుడు రెండో పార్ట్ కంటే నాకు మూడో పార్ట్ బాగా నచ్చిందంటూ చెప్పా. అలా అని రెండో భాగం బాలేదని దాని ఉద్దేశం కాదు. సాంబారు, రసంతో కూడిన భోజనాన్ని మనం ఇష్టంగా తింటాం. పాయసం ఉంటే మరింత ఆసక్తి చూపిస్తాం కదా. అలానే పలు అంశాల్లో భారతీయుడు మూడో భాగం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. నా కెరీర్‌లో ఈ సినిమా కోసమే ఎక్కువ శ్రమించాను. సుమారు ఆరేళ్లపాటు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. కొవిడ్/లాక్‌డౌన్, సెట్స్‌లో ప్రమాదం, అనారోగ్యం కారణంగా కొందరు స్టార్స్ మరణం. ఇలా పలు ఊహించని ఘటనలు జరిగాయి. సేనాపతి క్యారెక్టర్‌కు సంబంధించి వేసుకునే దుస్తులు నుంచి వాడే పెన్ను వరకు అన్నింటి విషయంలో డైరెక్టర్ శంకర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు" అంటూ కమల్ ఆ ప్రెస్ మీట్లో క్లారిటీ ఇచ్చారు.