Jr NTR Video Call to Fan who Suffers with Cancer:తనను ప్రేమించే అభిమానులన్నా, వారి కుటుంబసభ్యులన్నా ఎంతో ఆప్యాయత కనబరుస్తుంటారు కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్. క్యాన్సర్‌తో పోరాడుతున్న తన అభిమానికి తాజాగా వీడియో కాల్ చేసి ధైర్యం చెప్పారాయన. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
తిరుపతికి చెందిన కౌశిక్ (19) కొంతకాలంగా బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కౌశిక్ ఎన్టీఆర్ వీరాభిమాని కావడంతో తాను చనిపోయేలోపు 'దేవర' చూడాలని కోరుకుంటున్నట్లు తల్లిదండ్రులకు చెప్పాడు. కౌశిక్ తల్లి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ద్వారా ఆ విషయాన్ని తారక్ దృష్టికి తీసుకెళ్లారు. అంతే కాకుండా తన కుమారుడి వైద్యానికి రూ.60 లక్షలు ఖర్చు అవుతుందని ప్రభుత్వం, దాతలు సాయం చేయాలని కౌశిక్ తల్లి మీడియా ఎదుట కోరారు. వెంటనే స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ కౌశిక్‌కు వీడియో కాల్ చేసి ఆప్యాయంగా పలకరించారు. కౌశిక్ ధైర్యంగా కోలుకొని బయటకు రావాలని, దేవర సినిమా చూడాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు కౌశిక్‌ను జాగ్రత్తగా చూసుకోవాలని ఎన్టీఆర్ సూచించారు.
''ధైర్యంగా కోలుకుని బయటకు రావాలి. 'దేవర' చూడాలి. సినిమా అనేది తర్వాత నువ్వు ముందు కోలుకుని రావాలి. తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి" అని ఎన్టీఆర్ అన్నారు. "అన్నా మిమ్మల్ని చూస్తానని అస్సలు అనుకోలేదు" అని కౌశిక్ అనగా "నేను మాట్లాడకపోతే ఎట్లా నీతో" అని తారక్ ఆప్యాయత కనబరిచారు.
Devara Run Time:గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన 'దేవర పార్ట్ 1' సినిమా నుంచి రీసెంట్గా రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. అంతేకాకుండా యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచి లక్షల వ్యూస్‌తో దూసుకుపోతోంది. అయితే సెప్టెంబర్ 27న సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఇక తాజాగా సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి.