Jayam Ravi Divorce : తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ఇటీవలే కోలీవుడ్ హీరో జయం రవి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై రవి భార్య ఆర్తి సంచలన ఆరోపణలు చేసింది. తనకు తెలియకుండానే జయం రవి డివొర్స్ ప్రకటన చేశారని ఆరోపించింది. ఈ బహిరంగ ప్రకటన చూసి తాను దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ నోట్ కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ విషయం మరింత చర్చనీయాంశంగా మారింది.
Jayam Ravi Wife Aarti Ravi :"నాకు తెలియకుండా నా పర్మిషన్ తీసుకోకుండానే డివొర్స్ గురించి జయం రవి బహిరంగంగా ప్రకటించారు. ఇది తెలిసి నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. ఎంతో బాధ పడ్డాను. 18 ఏళ్లుగా మేము కలిసి ఉన్నాం. అయినా ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని నా పర్మిషన్ తీసుకోకుండా బయట పెట్టడం నన్ను ఎంత గానో బాధించింది. కొంత కాలంగా మా మధ్య వచ్చిన మనస్పర్థలను, విభేదాలను పరిష్కరించాలని ఎన్నో సార్లు ప్రయత్నించాను. ఇప్పటికీ నా భర్తతో డైరెక్ట్‌గా మాట్లాడే ఛాన్స్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను. దురదృష్టవశాత్తూ నాకు ఆ అవకాశం దక్కట్లేదు. అని ఆర్తి నోట్లో పేర్కొన్నారు.