తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఫుల్‌ రొమాంటిక్ మోడ్‌లో జాన్వీ కపూర్‌ - అస్సలు ఆగేలా లేదుగా! - Janhvi Kapoor Devara - JANHVI KAPOOR DEVARA

Janhvi Kapoor Devara Chuttamalle Song : బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ రొమాంటిక్‌ మూడ్‌లో కనిపిస్తోంది. తాజాగా ఓ వీడియోను ఆమె పోస్ట్‌ చేయగా అది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మీరు చూశారా?

source Associated Press and ETV Bharat
Janhvi Kapoor Devara Chuttamalle Song (source Associated Press and ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 10, 2024, 5:06 PM IST

Updated : Aug 10, 2024, 5:12 PM IST

Janhvi Kapoor Devara Chuttamalle Song :బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ తన అందచందాలతో యూత్‌ను ఫిదా చేస్తుంటుంది. ముఖ్యంగా తెలుగు కుర్రాళ్లను అట్రాక్ట్‌ చేయడం కోసం మరింత కష్టపడుతోంది. ఎందుకంటే ఇప్పుడీ భామ దేవర సినిమాతో టాలీవుడ్‌లోకి సాలిడ్ ఎంట్రీ ఇవ్వనుంది. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో పల్లెటూరి భామగా కనిపించనుంది. తన నటనతో పాటు గ్లామర్ డోస్‌తో ఆడియెన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేయనుంది. తాజాగా ఈ మూవీ నుంచి చుట్టమల్లె అనే ఓ రొమాంటిక్‌ మెలోడీ సాంగ్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. విజువల్‌ వండర్‌గా ఇది తెరకెక్కింది. ఇందులో ఈ భామ తన అందమంతా ఆరబోసి ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేసింది!

అలాగే తన అందాలతో కుర్రకారును కూడా తెగ ఆకట్టుకుంది. ఈ సాంగ్‌ రిలీజై రోజులు గడుస్తున్నా యూత్ మాత్రం ఆ సాంగ్‌ను అస్సలు వదలట్లేదు. అందరూ ఈ సాంగ్‌ మేనియాలోనే ఊగిసలాడుతున్నారు. ఇప్పటి వరకు 50 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే జాన్వీ కూడా ఈ సాంగ్‌కు స్లోగా అడిక్ట్‌ అయిపోయిందట. ఈ విషయాన్ని ఆమెనే సోషల్‌ మీడియాలో తెలియజేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ సాంగ్‌ హిందీ వెర్షన్‌కు ఓ రీల్ చేసి వదిలింది. ఈ రీల్‌లో జాన్వీ తన అందంతో మా అభిమానుల గుండెల్ని చుట్టేస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇందులో జాన్వీ గౌన్‌ ధరించి ఎంతో కూల్‌గా, అందంగా కనిపించింది.

అంతకుముందు ఇంటర్వ్యూలో ఈ పాట గురించి జాన్వీ మాట్లాడుతూ - "చుట్టమల్ సాంగ్‌కు వస్తోన్న రెస్పాన్స్‌ ఎంతో ఆనందంగా అనిపిస్తోంది. ఈ సాంగ్‌ విషయంలో నాపై నెగెటివ్‌ ట్రోల్స్‌ రాలేదు. ఇది కూడా ఎంతో సంతోషానిచ్చింది. నా డ్యాన్స్‌తో పాటు ఎన్టీఆర్‌తో కెమిస్ట్రీ ప్రతిఒక్కరికీ నచ్చింది." అని చెప్పుకొచ్చింది. ఇకపోతే ఈ సాంగ్‌కు సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ చేస్తున్న రీల్స్‌ను జాన్వీ రోజూ తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ చేస్తూ వారిని అభినందిస్తోంది. కాగా, దేవర చిత్రాన్ని సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నద్ధమవుతున్నారు. దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

జాన్వీ కపూర్ ప్రియుడు ఏం చేస్తాడో తెలుసా? - అతడి ఆస్తి ఎన్ని కోట్లంటే? - Janhvi Kapoor Boyfriend

'ఆ పని నేర్చుకునేందుకు ఎన్​టీఆర్​కు ఒక్క సెకను - నాకైతే 10 రోజులు' - Janhvi Kapoor Jr NTR

Last Updated : Aug 10, 2024, 5:12 PM IST

ABOUT THE AUTHOR

...view details