Jyothi Rai Tweet Second Marriage :ఎప్పుడూ ఏదో ఒక విషయంలో రోజూ వార్తల్లో నిలుస్తుంటుంది గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జగతీ మేడమ్. అలియాస్ జ్యోతి రాయ్. ఈ ధారావాహికతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ అందం సీరియల్లో ఎంతో ట్రెడిషనల్‌గా కనిపించి ఆకట్టుకుంది. కానీ రియల్ లైఫ్‌లో మాత్రం చాలా భిన్నం. సోషల్ మీడియాలో హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ ప్రతిఒక్కరినీ షాక్‌కు గురిచేసింది. ఈమెను చూసిన వాళ్లంతా నిజంగా ఈమె జగతీమేడమేనా అంటూ గిల్లుకుని మరీ చూసుకునేలా చేసింది.
అలా కొంత కాలం నుంచి అందాల ప్రదర్శనలతో రెచ్చిపోతున్న జ్యోతి రాయ్ సెగలకు కుర్రాళ్లు తట్టుకోలేకపోయారు. అయితే ఈమె ప్రస్తుతం సినిమాల్లోనూ చేస్తోంది. ఇక పర్సనల్ లైఫ్ విషయానికొస్తే ఈమెకు గతంలోనే పెళ్లి జరిగింది. కానీ మనస్పర్థల వల్ల విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ఓ యంగ్ డైరెక్టర్‌తో రిలేషన్షిప్లో ఉంటోంది. అతనే ఏ మాస్టర్ పీస్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సురేశ్ కుమార్ అలియాస్ సుకు పూర్వాజ్. అయితే వీరిద్దరికి పెళ్లి కూడా జరిగిందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ దీనిపై అఫీషియల్‌గా ఎటువంటి ఫొటోస్ బయటకు రాలేదు.
ఇకపోతే జగతిమేడం సోషల్ మీడియాలో పెట్టే హాట్ హాట్ పోస్ట్‌లను హాట్ కేకుల్లా ఫీలవుతుంటారు నెటిజన్లు. తాజాగా తన ప్రియుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె చేసిన హాట్ కామెంట్స్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. హగ్గులు, కిస్సులు అంటూ తన ప్రియుడు పంచిన ప్రేమను తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టింది జ్యోతి రాయ్.