తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

షాకింగ్ ​: సీక్రెట్​గా పెళ్లి - ఏడాదికే విడాకులు తీసుకున్న జబర్దస్త్​ నటి - jabardast Priyanka Nalkari

Jabardast Actress Priyanka Nalkari Divorce : పలు టీవీ సీరియళ్లు, టీవీ షోస్‌తో ఆకట్టుకున్న తెలుగు నటి, జబర్దస్త్ ఫేమ్​  ప్రియాంక నల్కారి తన భర్తతో విడిపోయింది.  ప్రేమించి సీక్రెట్​గా పెళ్ళి చేసుకున్న ప్రియాంక  ఏడాది కూడా తిరక్కుండానే విడిపోవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అసలేం జరిగిందంటే?

jabardast-actress-priyanka-nalkari-cofirmed-divorced-news
jabardast-actress-priyanka-nalkari-cofirmed-divorced-news

By ETV Bharat Telugu Team

Published : Feb 14, 2024, 10:09 AM IST

Updated : Feb 14, 2024, 3:11 PM IST

Jabardast Actress Priyanka Nalkari Divorce : సినీ సెలబ్రిటీలు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో ఎప్పుడు విడిపోతారో అస్సలు చెప్పలేం. వీరి కాపురం మూడునాళ్ల ముచ్చటగానే ముగిసిపోవడం వారి అభిమానులను షాక్​కు గురి చేస్తోంది. అప్పట్లో సమంత-నాగ చైతన్య, ఈ మధ్య ఐశ్వర్య-ధనుశ్​, మెగా డాటర్ నిహారిక ఇలా పలువురు తమ బంధాల్ని తెగదెంపులు చేసుకున్నారు. వీటిని ఇంకా మర్చిపోనేలేదు ఇప్పుడు మరో నటి కూడా ఆ బాటలోనే నడిచింది. ఇంకా చెప్పాలంటే అసలీ నటి పెళ్లి చేసుకోవడమే ఓ సస్పెన్స్ అయితే, విడిపోవడం కూడా అలానే జరిగింది.

వివరాల్లోకి వెళితే. తెలుగమ్మాయి ప్రియాంక నల్కరి గురించి చాలా మంది బుల్లితెర ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. పలు తెలుగు టీవీ సీరియళ్లు, షోస్​తో పాటు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా నటించి బాగానే పాపులర్ అయింది. జబర్దస్త్ లాంటి షోలతోనూ ప్రేక్షకులను అలరించింది. యాంకర్​గానూ కొన్ని షోలు చేసి ఆకట్టుకుంది. ఆ తర్వాత తమిళ ధారావాహికలతో బిజీ అయిపోయింది. ఈమెనే తాజాగా విడాకులు తీసుకున్నట్లు తెలిసింది.

ప్రియాంక నల్కరి సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్​తో ఎప్పటి లాగే ముచ్చటించింది. అయితే ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ మీరు, మీ భర్తతో విడిపోయారా అని ప్రశ్నించారు. దీనికి ఆమె అవును అని సమాధానం ఇచ్చింది. ఇక ఇది తెలుసుకున్నవారంతా షాక్​ అవుతున్నారు. ఎందుకంటే అసలు కనీసం రూమర్స్​ కూడా రాలేదు. డైరెక్ట్​గా ఆమె విడిపోయామని సమాధానం చెప్పగానే ఈ విషయం హాట్ టాపిక్​గా మారిపోయింది. మరి ఇందులో నిజమెంతో తెలీదు కానీ అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు.

ప్రియాంక గత ఏడాది మార్చిలో రాహుల్ వర్మ అనే నటుడిని మలేషియాలోని ఓ ఆలయంలో సైలెంట్ అండ్ సీక్రెట్​గా వివాహమాడింది. అనంతరం పెళ్లి చేసుకున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకుంది. కానీ ఆ తర్వాత ఇది సీక్రెట్​ కాదు అనీ కుటుంబ సభ్యుల సమక్షంలోనే అని చెప్పింది. దీంతో ప్రేమించి సీక్రెట్​గా పెళ్ళి చేసుకున్న ప్రియాంక రాహుల్ ఏడాది కూడా తిరక్కుండానే విడిపోవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

వాలంటైన్స్​ డే : అనుపమ టు మృణాల్ ఠాకూర్ - ఈ ముద్దుగుమ్మల ప్రేమ కథలు తెలుసా?

రూట్ మార్చిన టాలీవుడ్ స్టార్స్​ - ఈసారి సమ్మర్​లో మరింత కొత్తగా!

Last Updated : Feb 14, 2024, 3:11 PM IST

ABOUT THE AUTHOR

...view details