Prabhas Kalki 2898AD Villian Role : ప్రభాస్ కల్కి 2898AD సినిమాతో బెంగాలీ యాక్టర్ సశ్వతా ఛటర్జీ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారని చాలా మందికి తెలిసిందే. అయితే ఆయన పాత్ర ఏంటనేది ఇంతవరకు స్పష్టత కాలేదు. మరోవైపు సినిమాలో విలన్‌గా యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించనున్నారని ఆ మధ్య ప్రచారం సాగగా ఆ తర్వాత కాదని తేలిపోయింది. దీంతో సినిమాలో ప్రతినాయకుడు ఎవరై ఉంటారా అనే ఆసక్తి కూడా అందరిలో నెలకొంది.
అయితే ఇప్పుడు సినిమాలోకి కీలక పాత్రలైన భైరవ అండ్ బుజ్జి B&B ప్రిల్యూడ్ పేరుతో యానిమేటెడ్ సిరీస్ అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా రీసెంట్గా విడుదలైంది. ఇందులో బుజ్జీ, భైరవలతో పాటు ఓ పెద్ద విగ్రహం కూడా కనిపించింది. నాయకుడిగా కనిపిస్తూ ఒక చెయ్యెత్తి నిల్చొన్న విగ్రహం అది. అయితే ఆయన బెంగాలీ యాక్టర్‌లానే ఉన్నారన్న చర్చ మొదలైంది. గ్లింప్స్‌లోని ఆ షాట్స్ ఆధారంగా చూస్తే బెంగాలీ యాక్టర్ కచ్చితంగా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించే అవకాశాలున్నాయని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే మూవీ టీమ్ దీనిపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.
కాగా, మైథలాజికల్ కాన్సెప్ట్‌తో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా కల్కీ 2898AD తెరకెక్కుతోంది. ఆయనతో పాటుగా మరింత మంది స్టార్ నటులు ఇందులో నటిస్తున్నారు. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన, దీపికా పదుకొనె, దిశా పటానీలు ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, కీర్తి సురేశ్ బుజ్జి(కార్)కి వాయీస్ ఇచ్చింది.