Pushpa The Rule Interesting Facts : యావత్ సినీ ప్రపంచం ఎదురుచూస్తోన్న సమయం ఆసన్నమైంది. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన 'పుష్ప ది రూల్' మరికొన్ని గంటల్లో రిలీజ్ అవ్వనుంది. దాదాపు మూడేళ్ల క్రితం విడుదలైన 'పుష్ప: ది రైజ్'కు సీక్వెల్గా ఇది వస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాతోపాటు షూటింగ్ విశేషాలు, నటీనటుల రెమ్యూనరేషన్స్ గురించి తెలుసుకునేందుకు సినీప్రియులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో 'పుష్ప ది రూల్'కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
నాలుగో చిత్రం
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో వస్తోన్న నాలుగో సినిమా 'పుష్ప ది రూల్'. 2004లో తొలిసారి వీరిద్దరి కాంబోలో 'ఆర్య' విడుదలై భారీ హిట్ కొట్టింది. ఆ తర్వాత 'ఆర్య 2', 'పుష్ప ది రైజ్' వచ్చాయి. ఇప్పుడు 'పుష్ప 2' తెరకెక్కింది.
రూ.300కోట్ల రెమ్యూనరేషన్
'పుష్ప ది రూల్' సినిమా కోసం అల్లు అర్జున్ రూ.300 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారట. అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుల జాబితాలో ఆయన మొదటి స్థానంలో నిలిచారని ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ ఇటీవల వెల్లడించింది.
2 ఏళ్లపాటు షూటింగ్
2022లో పుష్ప సినిమాకు సంబంధించిన పనులు మొదలయ్యాయి. అల్లు అర్జున్ లుక్ టెస్ట్ చేసి, సినిమాను ప్రకటించారు. 2023లో రెగ్యులర్ షూట్ మొదలైంది. విశాఖపట్నం, బెంగళూరు, ఒడిశా, హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో షూటింగ్ జరిపారు. 2024 నవంబర్లో ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేశారు.
రెండు పార్టులుగా పుష్ప
'పుష్ప'ను ఒక సినిమాగానే తీసుకురావాలని మొదట భావించారు. కానీ, సుకుమార్ స్క్రిప్ట్ ప్రకారం కొంత షూటింగ్ అయిన తర్వాత నిర్మాత చెర్రీ వచ్చి సినిమా ఎంతవరకూ వచ్చిందని అడిగారు. అప్పటికే మూడున్నర గంటల ఫుటేజ్ రావడంతో ఆయన సూచనమేరకు రెండు పార్టులుగా విడుదల చేద్దామని భావించారు. అప్పటివరకూ తీసిన దాన్ని ఎడిట్ చేసి‘ పుష్ప1: ది రైజ్ గా రిలీజ్ చేశారు. ఇప్పుడు మూడేళ్ల తర్వాత పుష్ప2 తో ప్రేక్షకుల ముందుకువస్తున్నారు.
ఒక్క సీక్వెన్స్ కోసం రూ.60కోట్ల ఖర్చు
'పుష్ప2' గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్ సినిమాకే హైలైట్ అని టాక్ నడుస్తోంది. ఇందులో బన్నీ మాతంగి వేషంలో కనిపించనున్నారు. కేవలం ఈ ఒక్క సీక్వెన్స్ కోసమే ఏకంగా రూ.60 కోట్లు ఖర్చు పెట్టారు. దాదాపు 30 రోజులపాటు దీనిని షూట్ చేశారట.
రష్మిక పాత్ర నిడివి