తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఎట్టకేలకు కంగన 'ఎమర్జెన్సీ' విడుదల ఖరారు - కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్​ - KANGANA RANAUTS EMERGENCY RELEASE

కంగన 'ఎమర్జెన్సీ' రిలీజ్​కు లైన్ క్లియర్​ - సోషల్ మీడియా వేదికగా విడుదల తేదీ ప్రకటించిన నటి

Kangana Ranauts Emergency Release Date
Kangana Ranauts Emergency Release Date (source ANI And ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 18, 2024, 12:21 PM IST

Kangana Ranauts Emergency Release Date : స్వీయ దర్శకత్వంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ నటించిన ఎమర్జెన్సీ రిలీజ్​కు ముందే పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే వాయిదా పడుతూ వస్తోన్న ఆ సినిమా ఎట్టకేలకు కొత్త రిలీజ్​ డేట్​ను ఖరారు చేసుకుంది. ఈ విషయాన్ని కంగనా సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు. సినిమా వచ్చే ఏడాది 2025 జనవరి 17న రానున్నట్లు పేర్కొన్నారు.

సెన్సార్ బోర్డుతో సమస్యలు, కోర్టులో కేసులు -

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను సినిమాలో ప్రముఖంగా చూపించనున్నారు. అయితే ఈ సినిమా ప్రచార చిత్రాలు విడుదలైనప్పటి నుంచే చిత్రంపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. తమ గురించి తప్పుగా చిత్రీకరించారంటూ ఓ వర్గం సెన్సార్‌ బోర్డుకు లేఖ కూడా రాసింది. దీంతో, సెన్సార్‌ బోర్డు ఈ సినిమాకు సంబంధించి పలు సన్నివేశాల్లో అభ్యంతరం వ్యక్తం చేసింది.

అయితే సెన్సార్‌ బోర్డులోనూ చాలా సమస్యలున్నాయని, తమ చిత్రానికి సర్టిఫికెట్‌ ఇవ్వడంలేదంటూ కంగన అసహనం వ్యక్తం చేశారు. న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమన్నారు. ఈ క్రమంలోనే ఎమర్జెన్సీ విషయంలో ఓ నిర్ణయానికి రావాలంటూ బాంబే హైకోర్టు కూడా సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్స్‌ సర్టిఫికేషన్‌ను ఆదేశించింది. ఈ క్రమంలోనే ఆ తర్వాత ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ చిట్​ అక్టోబర్ 17న వచ్చింది. తమ సినిమాకు సెన్సార్​ పనులు పూర్తైనట్లు కంగన కూడా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. దీంతో ఈ చిత్రం సెప్టెంబర్ 6న వచ్చేందుకు సిద్ధమైంది. కానీ ఆ తర్వాత కూడా పలు కోర్టు కేసులను కూడా ఎదుర్కొన్న ఈ చిత్రం ఇప్పటి వరకు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. మరోవైపు, ఈ సినిమా విషయంలో కంగన హత్యా బెదిరింపులు కూడా ఎదుర్కొన్నారు.

కాగా, గత కొంత కాలంగా విజయానికి దూరంగా ఉన్న కంగనా రనౌత్​ ఈ ఎమర్జెన్సీ చిత్రం పైనే ఆశలు పెట్టుకున్నారు. అంతకుముందు ఓ సందర్భంలో ఈ చిత్రం గురించి ఆమె మాట్లాడుతూ తనకు సంబంధించిన ఆస్తులన్నింటినీ దీని కోసం తనఖా పెట్టినట్లు అన్నారు. మొదటి షెడ్యూల్ సమయంలో అయితే డెంగీ బారినపడి రక్తకణాల సంఖ్య భారీగా పడిపోయినా, షూట్‌లో పాల్గొనాల్సి వచ్చిందని చెప్పారు. ఈ చిత్రానికి ఆమె దర్శకత్వంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించారు. జయప్రకాష్‌ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే నటించారు.

కూతరు కోసం నయనతార యుద్ధం - లేడీ సూపర్ స్టార్​ కొత్త సినిమా టైటిల్ టీజర్ చూశారా?

'పుష్ప 2 నిజంగానే వైల్డ్​ ఫైర్'​ - ట్రైలర్​పై సినీ సెలబ్రిటీల రివ్యూస్​ ఇవే!

ABOUT THE AUTHOR

...view details