తెలంగాణ

telangana

దేశంలోనే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే బుల్లితెర నటి ఎవరో తెలుసా? - Highest Paid TV Actresses

By ETV Bharat Telugu Team

Published : Aug 24, 2024, 8:53 PM IST

Highest Paid TV Actress : మన దేశంలో సినిమా స్టార్ల రేంజ్​లో టీవీ నటులకు కూడా క్రేజ్ ఉంది. అందుకే వారికి సినీ నటులతో సమానంగా ఆదరణ ఉంటుంది. అలాగే మంచి పారితోషికం లభిస్తుంది. ఈ క్రమంలో దేశంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే బుల్లి తెర నటి ఎవరో చూద్దాం పదండి.

Highest Paid TV Actress
Highest Paid TV Actress (Getty Images)

Highest Paid TV Actresses : ప్ర‌స్తుతం బుల్లితెర నటులు సినిమా స్టార్స్​తో స‌మానంగా క్రేజ్​ను సొంతం చేసుకుంటున్నారు. స్టార్​ డ‌మ్​లోనే కాకుండా కొంద‌రు టీవీ న‌టీనటులు రెమ్యున‌రేష‌న్స్​లో హీరో, హీరోయిన్లతో పోటీప‌డుతున్నారు. కోట్ల‌లో రెమ్యున‌రేష‌న్స్ సొంతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే బుల్లితెర నటి ఎవరు? ఆమె నెలకు ఎంత సంపాదిస్తున్నారో? ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బుల్లితెర నటి హీనా ఖాన్(36) అంటే తెలియనివారుండరు. ఈ అమ్మడు 1987 అక్టోబరు 2న శ్రీనగర్​లోని సంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించారు. లఖ్​నవూలోని CMS మాంటిస్సోరి స్కూల్​లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ దిల్లీలోని గార్గి కాలేజీలో పూర్తి చేశారు. ఆ సమయంలో హీనా ఖాన్ 'యే రిష్తా క్యా కెహ్లతా హై' షో కోసం ఆడిషన్​కు వెళ్లారు. ఆ షో లీడ్ క్యారెక్టర్ 'అక్షర మహేశ్వరి సింఘానియా'కు ఎంపికయ్యారు. 22 ఏళ్ల వయసులో హీనా ఖాన్ టీవీ రంగంలోకి అడుగుపెట్టారు. 'దివా కసౌతి జిందగీ కే', 'నాగిన్' వంటి ప్రఖ్యాత టెలివిజన్ షోల సిరీస్​లో అదరగొట్టారు. అలాగే ఓ బాలీవుడ్ సినిమా, వెబ్ సిరీస్​లో ద్వారా బుల్లితెర ఆడియెన్స్​కు మరింత చేరువయ్యారు.

నెలకు రూ.35 లక్షల సంపాదన!
ఇక అసలు విషయానికొస్తే హీనా ఖాన్ భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటి అని తెలుస్తోంది. ఆమె నెలకు రూ.35 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారట. రోజుకు ఒక టీవీ ఎపిసోడ్ కు రూ.లక్ష- రూ.లక్షన్నర వరకు ఛార్జ్ చేస్తారట. ఇటీవల కాలంలో రూ.2 లక్షలు తీసుకుంటున్నారట. దేశంలో అత్యంత పాపులర్ బుల్లెతెర నటుల్లో హీనా ఖాన్ ఒకరు కావడం వల్ల ఆమెకు అంత మొత్తంలో ఇచ్చేందుకు నిర్మాతలు వెనుకాడట్లేదని సమాచారం. టీవీ షోలో పనిచేయడమే కాకుండా ఆమె బ్రాండ్ ఎండార్స్​మెంట్స్ ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తున్నారని తెలుస్తోంది. హీనా ఖాన్ ఆస్తి రూ.52 కోట్ల వరకు ఉంటుందట.

కార్లంటే బాగా ఇష్టం
హీనా ఖాన్​కు కార్లంటే చాలా ఇష్టమట. అందుకే తన గ్యారేజ్​ను ఖరీదైన కార్లతో నింపేస్తారట. ఆడి ఏ4 (రూ. 44 లక్షలు), రెనాల్ట్ ట్రైబర్ (రూ. 8 లక్షలు), ఇన్నోవా క్రిస్టా (రూ. 25 లక్షలు), హోండా సిటీ (రూ. 15 లక్షలు), ఆడి క్యూ7 (రూ. 89 లక్షలు) వంటి కార్ల కలెక్షన్​ను హీనా ఖాన్ కలిగి ఉన్నారట. అలాగే హీనాకు ముంబయిలోకి వర్లీలో ఖరీదైన ఓ లగ్జరీ హౌస్ కూడా ఉంది. కాగా, హీనాఖాన్‌ ఇటీవల రొమ్ము క్యాన్సర్‌ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె ఆ వ్యాధికి చికిత్స పొందుతున్నారు.

నగ్నంగా నటించడంపై స్పందించిన స్టార్​ హీరో - అందుకే అలా కనిపించారట! - Highest Collection Movie in India

భారీ బడ్జెట్ ఇండియన్​​ సీరియల్​ ఇదే - RRR, కల్కి, ఆదిపురుష్ బడ్జెట్​ కన్నా ఎక్కువ! - Indian Most Expensive TV Show

ABOUT THE AUTHOR

...view details