తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పవన్ ఫ్యాన్స్​కు పవర్​ఫుల్ అప్​డేట్​ - 'హరిహర వీరమల్లు' రిలీజ్ ఎప్పుడంటే? - Hari Hara Veera Mallu Release Date - HARI HARA VEERA MALLU RELEASE DATE

Hari Hara Veera Mallu Release Date : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అప్​కమింగ్ మూవీ 'హరిహర వీరమల్లు' రిలీజ్ డేట్​ను మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. ఇంతకీ ఈ చిత్రం థియేటర్లలో ఎప్పుడు సందడి చేయనుందంటే?

Hari Hara Veera Mallu Release Date
Pawan Kalyan (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 23, 2024, 11:13 AM IST

Hari Hara Veera Mallu Release Date :పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న 'హరిహర వీరమల్లు' మూవీ రిలీజ్ డేట్​ను మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు చిత్ర నిర్మాత ఏఎం రత్నం తెలిపారు. "అన్‌స్టాపబుల్‌ ఫోర్స్‌, అన్‌బ్రేకబుల్‌ స్పిరిట్‌ మార్చి 28న విడుదల కానుంది" అంటూ ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా ఈ అనౌన్స్​మెంట్​ను చేశారు.

17వ శతాబ్దం నేపథ్యంలో సాగే కథతో పవన్ అభిమానులను అలరించనున్నారు. మొఘలుల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతోంది. పవన్‌ కల్యాణ్​ ఓ వీరోచిత బందిపోటుగా కనిపిస్తారట. ఇప్పటికే విడుదలైన ఆయన లుక్స్ కూడా ఫ్యాన్స్​ను బాగా ఆకట్టుకున్నాయి. క్రిష్‌, జ్యోతికృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'హరిహర వీరమల్లు పార్ట్‌ 1: స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌' పేరుతో విడుదల కానుంది. బాబీ దేవోల్‌, అనుపమ్‌ఖేర్‌, నోరా ఫతేహి, విక్రమ్‌ జీత్‌, నిధి అగర్వాల్‌, జిషుసేన్‌ గుప్త ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి స్వరాలు అందిస్తున్న ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే తొలి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపుదశకు చేరుకుందని సమాచారం.

భారీ సెట్​లో షూటింగ్ స్టార్ట్
పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా షూటింగ్ పలు మార్లు వాయిదా పడింది. అయితే తాజాగా తనపై వచ్చే సీన్స్​ను మాత్రం ఆయన పూర్తి చేసేందుకు ఓకే చెప్పారట. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం 7 గంటలకు విజయవాడలోని ఓ భారీ సెట్​​లో షూట్​ మొదలైనట్లు తెలుస్తోంది. ఈవిషయాన్నీ చిత్రనిర్మాణ సంస్థ తెలియజేసింది. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నిక్ పాల్ నేతృత్వంలో భారీ యాక్షన్ సీన్స్​ను ఇక్కడ షూట్‌ చేయనున్నారని సమాచారం. ఇందులో పవన్​తో పాటు ఇతర కీలక నటీనటులు భాగం కానున్నారని తెలుస్తోంది.

ధర్మం కోసం యుద్ధం - రెండు భాగాలుగా వీరమల్లు - పవర్​ఫుల్​ టీజర్​ చూశారా? - HARI HARA VEERA MALLU TEASER

పవన్​ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' డైలాగ్​ లీక్​- 'యానిమల్' విలన్ అంత పని చేశాడా!

ABOUT THE AUTHOR

...view details