తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

జాన్వీ ఆ విషయంలో అస్సలు కంట్రోల్​ చేసుకోలేదట - ఈ సీక్రెట్​ మీకు తెలుసా? - Happy Birthday Janvi kapoor

Happy Birthday Janvi kapoor : బాలీవుడ్ భామ జాన్వీ కపూర్​ త్వరలోనే తెలుగు తెరపై సందడి చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ భామ ఓ విషయంలో అస్సలు తనను తాను కంట్రోల్​ చేసుకోలేదట. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పింది. ఆ వివరాలు.

జాన్వీ ఆ విషయంలో అస్సలు కంట్రోల్​ చేసుకోలేదట - ఈ సీక్రెట్​ మీకు తెలుసా?
జాన్వీ ఆ విషయంలో అస్సలు కంట్రోల్​ చేసుకోలేదట - ఈ సీక్రెట్​ మీకు తెలుసా?

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 11:14 AM IST

Updated : Mar 6, 2024, 11:34 AM IST

Happy Birthday Janvi kapoor :అలనాటి అందాల తార శ్రీదేవి వారసురాలిగా సిల్వర్ స్క్రీన్​కు ఎంట్రీ ఇచ్చిన అందం - జాన్వీ కపూర్‌. ధడక్‌ చిత్రంతో అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకూ దాదాపుగా తొమ్మిది చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. అలా వరుస చిత్రాల్లో నటిస్తూ తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్‌ మీడియాలో కూడా ఫుల్ జోరు చూపిస్తోంది. ఫుల్​ గ్లామరస్‌ ఫొటోలు, హాట్‌ పోజులతో కుర్రాళ్ల మతులు పోయేలా చేస్తోంది. అయితే నేడు ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు సందర్భంగా తనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. అలాగే దీంతో ఆమె పోస్ట్ చేసిన పలు హాట్ ఫొటోషూట్లపై ఓ లుక్కేద్దాం.

త్వరలోనే తెలుగు తెరపై కూడా సందడి చేయనుంది జాన్వీ కపూర్. టాలీవుడ్​ ఎంట్రీ కోసం పెద్ద ప్లానే వేసి భారీ ఆఫర్లను సొంతం చేసుకుంది. ప్రస్తుతం యంగ్ టైగర్​ ఎన్టీఆర్‌ - కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర(Devara Movie Heroine Janvi) చిత్రంలో నటిస్తోంది. పల్లెటూరి యువతిలా ఇప్పటికే విడుదలైన పోస్టర్​ కూడా ఫ్యాన్స్​ను బాగానే ఆకట్టుకుంది.

రామ్​చరణ్ బుచ్చిబాబు ఆర్​ సీ 16లోనూ హీరోయిన్​గా(RC 16 Heroine) ఛాన్స్​ దక్కించుకుంది. దీనికి సంబంధించి తాజాగా విడుదల చేసిన పోస్టర్​లో ఎంతో క్యూట్​గా కనిపించింది. అలానే కోలీవుడ్ ఎంట్రీ కోసం కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం హిందీలో దోస్తానా 2, ఉలాజ్‌ చిత్రాలలో నటిస్తోంది.

ఇక ఈ ముద్దుగుమ్మ పర్సనల్ విషయానికొస్తే ఖాళీ దొరికినప్పుడల్లా జిమ్‌లో వ్యాయామాలు చేస్తుంటుంది. లేదంటే కంటినిండా నిద్రపోయేందుకు ప్రాముఖ్యత ఇస్తుంది. అలానే అందం అంటే చాలా ఇష్టమట. అందుకే సోషల్ మీడియా ట్రెండ్స్​ను బాగా ఫాలో అవుతూ గ్లామర్​ మీద బాగా ఫోకస్ చేస్తానని చాలా సార్లు చెప్పింది.

ఫుడ్స్​లో పిజ్జాలు తినడం బాగా ఇష్టమట. డైటింగ్​లో ఉన్నా కూడా అస్సలు కంట్రోల్ చేసుకోలేక వాటిని తెగ తినేస్తుందట. ఆ తర్వాత కసరత్తులు చేసి బరువు తగ్గిస్తానని అంటుంది జాన్వీ. అలానే ముంబయి వీధుల్లో షికార్లు కొడుతూ స్ట్రీట్ పుడ్ తినడం ఇష్టమని చెప్పింది. ఇంకా తన దగ్గర ఉన్న వెహికల్స్​లో బెంజ్ కారు అంటే బాగా ఇష్టమని చెప్పుకొచ్చింది.

తాను ఎప్పటికైనా మంచి నటిగా పేరు సంపాదించి, దర్శకురాలు గౌరీ షిండే డైరెక్షన్​లో నటించాలన్నది తన తల్లి శ్రీదేవి కోరిక అని చెప్పింది జాన్వీ. అందుకోసమే తాను కష్టపడుతున్నట్లు చెప్పుకొచ్చింది. పొల్యుషన్ అంటే అస్సలు ఇష్టం ఉండదని, ప్రకృతిలో గడపడమే ఇష్టమని తెలిపింది. ప్రశాంతత కోసమే మూడు నెలలకోసారైనా తిరుమల క్షేత్రాన్ని సందర్శిస్తున్నట్లు ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. నటి కాకపోయి ఉంటే సంచార జీవితం చేయడం, కొత్త వాళ్లని పరిచయం చేసుకోవడం, వాళ్లతో గడపడం చాలా ఇష్టమని అంది. లేదంటే రచయిత్రి అయ్యేదాన్నంటూ తన మనసులోని మాటలను చెప్పింది.

RC16 హీరోయిన్ అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ వచ్చేసింది - చరణ్ సరసన ఎవరంటే?

కీర్తి సురేశ్ తొలి బాలీవుడ్ సినిమా ఇదే - ఏకంగా ఎన్ని కోట్లు ఛార్జ్​ చేసిందంటే?

Last Updated : Mar 6, 2024, 11:34 AM IST

ABOUT THE AUTHOR

...view details