తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఓవర్సీస్​లోనూ 'హనుమాన్' పైసా వసూల్- ఆరో సినిమాగా రికార్డ్​ - హనుమాన్ కలెక్షన్ల రికార్డ్స్

Hanuman Overseas collections record: తేజ సజ్జా- ప్రశాంత్ వర్మ 'హనుమాన్' సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే హనుమాన్ వసూళ్లు రూ.200 కోట్లకు చేరుకున్నాయి. అయితే తాజాగా ఓవర్సీస్​లో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

Hanuman Overseas collections record
Hanuman Overseas collections record

By ETV Bharat Telugu Team

Published : Jan 25, 2024, 1:54 PM IST

Hanuman Overseas collections record:తేజా సజ్జా లీడ్ రోల్​లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'హనుమాన్‌'. తక్కువ బడ్జెట్​తో పాన్ ఇండియా లెవెల్​లో రూపొందిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ అందుకుని బాక్సాఫీస్​ వద్ద దూసుకెళ్తోంది. మరోవైపు ఓవర్సీస్​లోనూ హనుమాన్ ఊహించని రేంజ్​లో వసూళ్లు సాధిస్తోంది.ఇప్పటి వరకు వరల్డ్ వైడ్​గా రూ.200 కోట్లకు పైగా వసూలు చేసింది. తాజాగా ఈ సినిమా మరో అరుదైన ఘనతను సాధించింది.

ఓవర్సీస్​లో రూ.50 కోట్ల గ్రాస్​ వసూల్​ చేసిన తెలుగు సినిమాల జాబితాలో చేరింది. ఇప్పటికే ఈ లిస్ట్​లో రెబల్ స్టార్ ప్రభాస్ (బాహుబలి, బాహుబలి-2, సాహో, సలార్), రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ (ఆర్​ఆర్​ఆర్​) సినిమాలు ఉన్నాయి. అయితే ఈ 5 సినిమాలు కూడా భారీ బడ్జెట్​తో తెరకెక్కించిన సినిమాలే. వీటి సరసన లో బడ్జెట్​తో వచ్చిన హనుమాన్ స్థానం ఈ ఘనత సాధించడం విశేషం.

ఓవర్సీస్ లో రూ.50 కోట్ల గ్రాస్ వసూలు చేసిన తెలుగు సినిమాలు

  • బాహుబలి ది బిగినింగ్ (2015)
  • బాహుబలి-2 ది కంక్లూజన్ (2017)
  • సాహో (2019)
  • ఆర్ఆర్ఆర్ (2022)
  • సలార్- 1 సీజ్​ఫైర్ (2023)

Jai Hanuman Movie: ఇక సినిమా విషయానికి వస్తే ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా విడుదలైన ఈ మూవీకి త్వరలో సీక్వెల్​ రానుంది. 'జై హనుమాన్‌' అనే టైటిల్​తో ఈ మూవీ తెరకెక్కనుంది. దీని ప్రీ ప్రొడక్షన్‌ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. సినిమాను 2025లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Hanuman Movie Cast: హనుమాన్ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జతోపాటు అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించారు. వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, రాజ్ దీపక్ శెట్టి, గెటప్ శ్రీను తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. నిర్మాత నిరంజన్​రెడ్డి ప్రైమ్​షో ఎంటర్​టైన్​మెంట్ బ్యానర్​పై ఈ సినిమాను రూపొందించారు. గౌర హరి, అనుదీప్‌ దేవ్‌, కృష్ణ సౌరభ్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

'హనుమాన్​లో విభీషణుడి పాత్ర కీలకం - ఆయనే నా ఫస్ట్​ ​ఛాయిస్'​

రామాయణంపై మరో పాన్ ఇండియా మూవీ - ఈసారి ఎవరికీ తెలియని కథతో

ABOUT THE AUTHOR

...view details