తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'హనుమాన్​' మేనియా - 15 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్​ ఎంతంటే ? - హనుమాన్ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్​

Hanuman Movie Box Office Collections : తేజ సజ్జా లీడ్​ రోల్​లో విడుదలైన 'హనుమాన్​' మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్​ వద్ద సెన్సేషన్ క్రియేట్​ చేస్తూ సక్సెస్​ఫుల్​గా దూసుకెళ్తోంది. తాజాగా ఈ మూవీ కలెక్షన్స్ ఎంత వచ్చాయంటే ?

Hanuman Movie Box Office Collections
Hanuman Movie Box Office Collections

By ETV Bharat Telugu Team

Published : Jan 27, 2024, 12:17 PM IST

Updated : Jan 27, 2024, 12:41 PM IST

Hanuman Movie Box Office Collections :యంగ్​ హీరో తేజ సజ్జా- డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్​లో విడుదలైన హనుమాన్​ మూవీ బాక్సాఫీస్​ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తూ సక్సెస్​ఫుల్​గా దూసుకెళ్తోంది. పాన్ ఇండియా లెవెల్​లో రిలీజైన ఈ సినిమా ఇటు ఇండియాతో పాటు అటు ఓవర్సీస్​లోనూ సెన్సేషన్​ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా 15 రోజులకు గానూ రూ.250 కోట్లు వసూలు చేసినట్లు మూవీ టీమ్​ తాజాగా ట్విట్టర్​ వేదికగా ప్రకటించింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో సుమారు ఐదున్నర కోట్లకి పైగా గ్రాస్​ని అందుకున్నట్టుగా ట్రేడ్ వర్గాల సమాచారం.

Jai Hanuman Movie : ఇక సినిమా విషయానికి వస్తే - ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా విడుదలైన ఈ మూవీకి త్వరలో సీక్వెల్​ రానుంది. 'జై హనుమాన్‌' అనే టైటిల్​తో ఈ మూవీ తెరకెక్కనుంది. దీని ప్రీ ప్రొడక్షన్‌ పనులు ఇటీవల మొదలయ్యాయి. ఈ మేరకు ప్రశాంత్ వర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సీక్వెల్​ గురించి మాట్లాడారు.

"హనుమాన్‌ కన్నా వందరెట్లు భారీ స్థాయిలో 'జై హనుమాన్‌' ఉంటుంది. సీక్వెల్‌లో తేజ సజ్జా హీరో కాదు. సీక్వెల్‌లోనూ ఆయన హనుమంతు పాత్రలో కనిపిస్తారు. ఈ సీక్వెల్​ సినిమా హీరో ఆంజనేయ స్వామి. ఆ పాత్రలో ఓ స్టార్‌ హీరో నటిస్తారు. 2025లో ఇది రిలీజ్ అవుతుంది. దీని కన్నా ముందు నా నుంచి మరో రెండు సినిమాలు రాబోతున్నాయి. అందులో ఒకటి 'అధీర'. మరొకటి 'మహాకాళి' అని ప్రశాంత్‌ వర్మ చెప్పుకొచ్చారు.

Hanuman Movie Cast : తొలి పార్టులో తేజతో పాటు అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీ రోల్స్​లో నటించారు. వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, రాజ్ దీపక్ శెట్టి, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించారు. నిర్మాత నిరంజన్​రెడ్డి ప్రైమ్​షో ఎంటర్​టైన్​మెంట్ బ్యానర్​పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. గౌర హరి, అనుదీప్‌ దేవ్‌, కృష్ణ సౌరభ్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

హిందీలోనూ 'హనుమాన్' జోరు- KGF, జైలర్​ను దాటేసిన సూపర్​హీరో

రామ మందిరానికి 'హనుమాన్' భారీ విరాళం - ఎన్ని కోట్లంటే..?

Last Updated : Jan 27, 2024, 12:41 PM IST

ABOUT THE AUTHOR

...view details