GV Prakash Dasara Movie: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని కెరీర్లో 'దసరా' మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో నాని రూ.100కోట్లు క్లబ్లో ఎంటర్ అయ్యారు. నానితోపాటు ఈ సినిమాలో నటించిన హీరోయిన్ కీర్తి సురేశ్, దీక్షిత్ శెట్టి కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా నాని ఫ్రెండ్‌గా నటించిన దీక్షిత్ శెట్టి క్యారెక్టర్ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. అయితే ఈ క్యారెక్టర్ కోసం డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ముందుగా యంగ్ హీరో, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్‌ను సంప్రదించారట. ఈ విషయాన్ని జీవీ ప్రకాశ్ 'డియర్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు.
'దసరా సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం దర్శకుడు శ్రీకాంత్ నన్నే అప్రోచ్ అయ్యారు. కానీ, డేట్స్ సమస్య కారణంగా ఆ సినిమా చేయలేకపోయాను. అయితే త్వరలోనే తెలుగులో సినిమా చేస్తాను. ఇక డియర్ సినిమా కోసం అందరం చాలా కష్టపడ్డాం. తెలుగులో వాయిస్ అందించిన నాగచైతన్యకు స్పెషల్ థాంక్స్' అని జీవీ ప్రకాశ్ అన్నారు. ఇక ఈ సినిమాలో జీవీ ప్రకాశ్‌కు జంటగా హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ నటించింది. ఈ మూవీ తమిళం, తెలుగు భాషల్లో ఏప్రిల్ 12న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. కాగా, ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఇక ఈ సినిమాను దర్శకుడు ఆనంద్ రవిచంద్రన్ తెరకెక్కించారు. తన భార్య గురక వల్ల ఒక అబ్బాయి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అనే ఆసక్తికర అంశాలతో సినిమాను తెరెకెక్కించారు.