Classic Movies In OTT : వీకెండ్ వస్తే చాలు మనలో చాలామంది తమ ప్లాన్స్‌లో ఒక్కటైనా సినిమా చూడాలని అనుకుంటాం. కొందరేమో థియేటర్లలకు వెళ్లి చూస్తే, మరికొందరేమో ఇంట్లోనే రిలాక్స్డ్ మోడ్‌లో చూసి ఎంజాయ్ చేస్తారు. మరి ఈ సారి హౌస్ పా అయితే ఈ సారి మీ లిస్ట్‌లో ఈ సినిమాలను యాడ్ చేసేయండి.
బర్ఫీ (నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్)
నటీనటులు :ప్రియాంక చోప్రా, ఇలియానా, రణ్‌బీర్ కపూర్
హద్దుల్లేని ప్రేమను, దేనినైనా సమ్మతించే గుణాన్ని, ఇద్దరి మధ్యనున్న మాటల్లో చెప్పలేని బంధాన్ని ఈ సినిమా కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. బర్ఫీ జాన్సన్ (రణ్‌బీర్) చుట్టూనే ఈ కథ తిరుగుతుంటుంది. పుట్టుకతోనే మూగ, చెవిటి అయిన బర్ఫీ వెళ్లిన ప్రతి చోటా తన బాధలేమీ కనపడనీయకుండా సంతోషాన్నే పంచుతుంటాడు. జిల్మిల్ అనే మానసిక ఎదుగుదల లేని ప్రియాంక చోప్రా అతడికి పరిచయమవుతుంది. అక్కడితో కథ మారిపోతుంది. ఆ ఇద్దరి ప్రయాణం ఎలా సాగిందనేదే ఈ చిత్రం. ఎంతో ఎమోషనల్‌గా సాగే ఈ చిత్రం సినీ ప్రియులను అలరించింది.
ఓకే జాను ( అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్)
నటీనటులు : ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్
తెలుగులో వచ్చిన 'ఓకే బంగారం', తమిళంలోని 'కాదల్ కన్మనీ' సినిమాలకు రీమేక్ ఈ 'ఓకే జాను'. ముంబయిలోని ఓ ప్రముఖ గేమింగ్ కంపెనీలో పనిచేసే ఆది (ఆదిత్య రాయ్ కపూర్), తారా (శ్రద్దా కపూర్)ల మధ్య ప్రేమ చిగురిస్తుంది. కానీ, వాళ్ల కమిట్ అయి ఉన్న కెరీర్స్ కోసం ఎలా కష్టపడ్డారనేది ఇందులో చూపిస్తారు. మోడ్రన్ డే రిలేషన్‌షిప్స్‌లో ఉన్న సందిగ్ధాలను, కెమిస్ట్రీని చక్కగా కనబరిచారు.
డియర్ జిందగీ (నెట్‌ఫ్లిక్స్)
నటీనటులు : ఆలియా భట్, షారుక్ ఖాన్
మెంటల్ హెల్త్, ఎమోషనల్ రిలీఫ్ కావాలనుకునే వారు తప్పక చూడాల్సిన సినిమా ఇది. ఇందులో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసే (కైరా) అలియా భట్ ఒకానొక దశలో తీవ్రమైన మనో వేదనకు గురవుతుంది. ఆ సమయంలోనే డాక్టర్ జెహంగీర్ 'జగ్' ఖాన్ (షారుక్ ఖాన్)ను కలుస్తుంది. ఆమెలో ఉన్న భయాలన్నింటినీ పోగొట్టి, తిరిగి యథాస్థానానికి ఎలా తీసుకొచ్చాడనేది కథాంశం.
లైఫ్ ఇన్ ఏ మెట్రో (నెట్‌ఫ్లిక్స్)
నటీనటులు : ధర్మేంద్ర, ఇర్ఫాన్ ఖాన్, కొంకణ సేన్ శర్మ, శిల్పా శెట్టి, కంగనా రనౌత్