Dubbing Movies Dialogue Writer Sri Ramakrishna Died : తెలుగు చిత్ర సీమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ డబ్బింగ్ రచయిత, స్టార్ రైటర్ శ్రీరామకృష్ణ (74) తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 1న రాత్రి కనుమూశారు. ఈయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా, గుంటూరు జిల్లాలోని తెనాలికి చెందిన ఈయన చాలామంది సీనియర్లను వెండితెరకు పరిచయం చేశారు.
తెనాలీలో పుట్టినప్పటికీ చెన్నైలో సెటిల్ అయిన రామకృష్ణ గారికి అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ మంచి పట్టు ఉంది. బొంబాయి, జీన్స్, ఒకే ఒక్కడు, అపరిచితుడు, జెంటిల్మెన్, చంద్రముఖి లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఈయన మాటలను అందించారు. ఈయన ఎక్కువ సినిమాలు లెజెండ్ డైరెక్టర్స్ అయిన శంకర్, మణిరత్నం గార్లతోనే పని చేశారు. ఈయన కెరీర్ మొత్తంలో 300కు పైగా చిత్రాలకు డబ్బింగ్ రచయితగా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఈయన డైలాగ్స్ అందించారంటే సినిమా తప్పకుండా హిట్ అవ్వాల్సిందే అన్న రేంజీలో డైలాగ్స్ రాయగలరు. కొన్నేళ్లుగా చాలా తక్కువ ప్రాజెక్టులు మాత్రమే ఒప్పుకుంటున్న రామకృష్ణ చివరిగా రజనీకాంత్ నటించిన దర్బార్ సినిమాకు డైలాగ్స్ రాశారు. చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడటం వల్లనే ఈయన సినిమాలకు దూరంగా ఉన్నారని తెలుస్తోంది.
తమను వెండితెరకు పరిచయం చేసిన మహానుభావుడి మరణం తమను ఎంతగానో కలచివేసిందని సినీ ప్రముఖులు, నటులు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినిమా జీన్స్ తెరకెక్కించే సమయంలో ఆ డైలాగ్స్ చెప్పడంలో శ్రీరామకృష్ణ గారు సహకారం అందించారు. ఆయన దగ్గరే తెలుగు నేర్చుకున్నాని ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్ చెప్పుకొచ్చారు.
కేవలం డబ్బింగ్ సినిమాలకు రచయితగా మాత్రమే కాకుండా బాలమురళీ ఎంఏ, సమాజంలో స్త్రీ లాంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. బాలమురళీ ఎంఏ సినిమా కోసం నిమిత్తం కేవీ మహదేవన్, బాల సుబ్రహ్మణ్యం, పీ సుశీల గారితో కలిసి ఈయన పనిచేశారు. ఈ సినిమాకు రామకృష్ణా రెడ్డి, భాస్కర రెడ్డిలు నిర్మాతలుగా వ్యవహరించారు.
ఇకపోతే స్వస్థలం తెనాలి అయినప్పటికీ 50 ఏళ్ల క్రితమే చెన్నైలో స్థిరపడిపోయిన రామకృష్ణకు భార్య స్వాతి, కుమారుడు గౌతమ్ ఉన్నారు. చెన్నైలోని సాలిగ్రామంలో స్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
టాలీవుడ్లో మరో విషాదం - ప్రముఖ రైటర్ కన్నుమూత - Sri Ramakrishna Died
Dubbing Movies Dialogue Writer Sri Ramakrishna Died : తెలుగు చిత్ర సీమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ అనువాద మాటల రచయిత శ్రీరామకృష్ణ(74) కన్నుమూశారు.
టాలీవుడ్లో మరో విషాదం - ప్రముఖ రైటర్ కన్నుమూత
Published : Apr 2, 2024, 8:27 AM IST
|Updated : Apr 2, 2024, 9:28 AM IST
Last Updated : Apr 2, 2024, 9:28 AM IST