Disha Patani Kanguva Remuneration : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య - డైరెక్టర్ శివ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా మూవీ 'కంగువా' భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం మిక్స్డ్ టాక్‌తో థియేటర్లలో రన్ అవుతోంది. అయితే ఈ సినిమా మాత్రం పలు అంశాల కారణంగా నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. అందులో ఈ చిత్ర నటీనటుల రెమ్యూనరేషన్ ఒకటి.
ముఖ్యంగా ఇందులో ఫీమల్ లీడ్‌గా మెరిసిన దిశా పటానీ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం దిశాకు మేకర్స్ రూ. 5 కోట్ల పారితోషకాన్ని ఇచ్చారట. అయితే ఇది ఆమె ఇప్పటి వరకూ అందుకున్న రెమ్యూనరేషన్లలో అత్యథికమైనది కావడం విశేషం. అయితే ఈ సినిమాలో దిశాకు అంతగా ప్రాధాన్యత ఉన్న సీన్స్ లేకపోవడం అలాగే తన రోల్ కూడా తక్కువ నిడివితోనే ఉండటం గమనార్హం. దీంతో ఫ్యాన్స్ కూడా ఆమెకు ఎందుకంటే రెమ్యూనేరషన్ ముట్టజెప్పారంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరోవైపు ఈ సినిమా కోసం హీరో సూర్య సుమారు రూ.39 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నారట. అయితే ఆయన గత కొంత కాలంగా ఒక్క సినిమాకు దాదాపు రూ. 50 కోట్ల పారితోషకం అందుకున్నారట. కానీ ఈ సినిమాకు మాత్రం తక్కువగానే తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో మెరిసిన బాలీవుడ్ స్టార్ బాబీ దేఓల్ సుమారు రూ. 5 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంద.