తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'రజనీకాంత్ తర్వాత ఆ రేంజ్​ సమంతదే' - SAMANTHA RAJINIKANTH

Trivikram Praises on Samantha : హీరోయిన్ సమంతపై ప్రశంసలు కురిపించిన దర్శకుడు త్రివిక్రమ్.

source ETV Bharat
RAJINIKANTH SAMANTHA (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 8, 2024, 9:12 PM IST

Updated : Oct 8, 2024, 9:25 PM IST

Trivikram Praises on Samantha : హీరోయిన్ సమంతపై డైరెక్టర్​ త్రివిక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్​ చేశారు. ఆమెపై ప్రశంసలు కురిపించారు. టాలీవుడ్​తో పాటు తమిళం, మలయాళం ఇలా అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల్లోనూ ఒకే రేంజ్​ అభిమానగణం ఉన్న నటుల్లో రజనీకాంత్‌ తర్వాత సమంతనేనని పొగడ్తలు కురిపించారు. జిగ్రా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో త్రివిక్రమ్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

"ఏ మాయ చేసావె మూవీ నుంచే సమంత హీరో. ఆమెకు మరో శక్తి అక్కర్లేదు. ఆమెనే ఓ శక్తి. సమంత, మీరు ముంబయిలోనే ఉండిపోకుండా అప్పుడప్పుడు హైదరాబాద్‌కు వచ్చి వెళ్లండి. మీరు సినిమాలు చేయడం లేదనే మేం కథలు రాయడం లేదు. అదే మీరు నటిస్తే మేం రాస్తాం. అత్తారింటికి దారేదిలాగా, సమంత కోసం హైదరాబాద్‌కు రావడానికి దారేది అనాలేమో." అని త్రివిక్రమ్‌ పేర్కొన్నారు.

మాకు ఆ బాధ్యత ఉంది - "మీ కథలో మీరే హీరో అని అమ్మాయిలకు గుర్తుచేసే బాధ్యత హీరోయిన్‌గా మాపై ఉంటుంది. జిగ్రా చిత్రంతో అలియా ఈ విషయాన్ని చెప్తుంది. ఈ సినిమాకు అలియా సహ నిర్మాతగాను వ్యవహరించింది. రిస్క్‌ తీసుకుంది. త్రివిక్రమ్‌, రాహుల్ రవీంద్రన్‌ నా జిగ్రాస్‌. రాహుల్‌తో 15 ఏళ్ల ప్రయాణం ఉంది. త్రివిక్రమ్‌తో మూడు చిత్రాలు చేశాను. ప్రతి అమ్మాయికి రానా లాంటి సోదరుడు ఉండాలి. తెలుగు ప్రేక్షకులు ఎలా ఉంటారో అలియా RRRతో కొంత చూసింది. జిగ్రా రిలీజ్ తర్వాత పూర్తి స్థాయిలో చూస్తుంది. తెలుగు ప్రేక్షకుల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. మీ ప్రేమ వల్లే ఎదిగాను. మీరే నా కుటుంబం" అని సమంత పేర్కొంది.

మా ఇద్దరితో ఓ సినిమా చేయాలి - తనను, సమంతను కలిపి ఓ సినిమా చేయాలని దర్శకుడు త్రివిక్రమ్​ను ఆలియా భట్ అడిగింది. "నేను ఈ విషయాన్ని ప్రమోషన్ కోసం చెప్పడం లేదు. నిజంగానే చెబుతున్నాను. త్రివిక్రమ్ మీ దర్శకత్వంలో సమంత, నేను కలిసి నటించాలని అనుకుంటున్నాం" అని ఆలియా చెప్పింది.

నా కష్టానికి ప్రతిఫలం ఈ జాతీయ పురస్కారం : హీరోయిన్ నిత్య మేనన్‌

'పుష్ప 2' అదిరే అప్డేట్​ - తుపాను సృష్టించడానికి సిద్ధం!

Last Updated : Oct 8, 2024, 9:25 PM IST

ABOUT THE AUTHOR

...view details