తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'కర్ణుడి'గా సూర్య - బాలీవుడ్ ఎంట్రీ కన్ఫామ్​ - Suriya Bollywood Movie - SURIYA BOLLYWOOD MOVIE

Suriya Rakesh Om Prakash : కోలీవుడ్ హీరో సూర్య బీటౌన్​ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్​ రాకేష్ ఓంప్రకాష్.

source ETV Bharat
Suriya (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 5, 2024, 12:46 PM IST

Suriya Rakesh Om Prakash Bollywood Movie : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కథల ఎంపిక విషయంలో, యాక్టింగ్‌లో వైవిధ్యత చూపిస్తూ కెరీర్​లో ముందుకెళ్తుంటారు. ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీలో పలు హిట్ చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆయన త్వరలో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టనున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. సీనియర్‌ డైరెక్టర్​ రాకేష్ ఓంప్రకాష్ మెహ్రాతో కలిసి ఆయన ఓ సినిమా ('కర్ణ') చేయబోతున్నారంటూ టాక్ గట్టిగా వినిపిస్తోంది.

అయితే తాజాగా ఈ వైరల్‌ కామెంట్స్​పై ఐఫా (IIFA Awards)లో దర్శకుడు రాకేశ్​ స్పష్టత ఇచ్చారు. ఆ వార్తలు నిజమేనని అన్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ మూవీ గురించి ఇప్పుడే తాను అన్ని విషయాలు చెప్పాలని అనుకోవడం లేదని, సమయం వచ్చినప్పుడు అధికారికంగా చెబుతానని అన్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న సూర్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, రంగ్‌దే బసంతి, దిల్లీ 6, భాగ్ మిల్ఖా భాగ్, తుఫాన్‌ వంటి చిత్రాలతో బాలీవుడ్ మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఓం ప్రకాశ్‌ మిశ్రా. మహాభారతం ఆధారంగా సూర్యతో కలిసి 'కర్ణ' చిత్రాన్ని తెరకెక్కించనున్నారని సమాచారం అందింది. సూర్య కర్ణుడిగా కనిపిస్తారని టాక్‌ వినిపిస్తోంది. రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను భారీ స్థాయిలో రూపొందించనున్నారట. జాన్వీ కపూర్‌ హీరోయిన్​గా నటించనున్నారని ఆ మధ్య ప్రచారం సాగింది.

Suriya Kanguva Movie Update : సూర్య ప్రస్తుతం 'కంగువా' అనే భారీ బడ్జెట్​ చిత్రంలో నటించారు. ఈ మూవీని త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. నవంబర్‌ 14న ఇది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. పీరియాడిక్​ యాక్షన్‌ జానర్​లో రానుందీ సినిమా. దర్శకుడు శివ దీనిని తెరకెక్కించారు. బాలీవుడ్ హాట్ భామ దిశా పటానీ హీరోయిన్​గా నటించింది. బాలీవుడ్ స్టార్​ బాబీ దేవోల్‌ కీలక పాత్ర పోషించారు. విలన్​గా కనిపించనున్నారు. మూవీలో సూర్య మూడు విభిన్న లుక్స్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది.

త్రిష సెకండ్ ఇన్నింగ్స్​ జోరు ​ - అన్నీ రూ.200కోట్లకుపైనే వసూళ్లు! - Heroine Trisha 200 Crore Club

సెన్సేషనల్​ డైరెక్టర్​తో షారుక్ ఖాన్ కొత్త సినిమా​ - సాహసికుడుగా బాద్​షా! - Sharukh Khan New Movie

ABOUT THE AUTHOR

...view details