Deepika padukone Net worth Business :ఇండియాలో టాప్ లెవల్లో రెమ్యూనరేషన్ ఛార్జ్ చేసే హీరోయిన్లలో దీపికా పదుకొణె ఒకరు. కల్కి 2898 ఏడీ చిత్రంతో రీసెంట్‌గానే భారీ హిట్‌ను అందుకున్న ఈ భామ, కన్నడలో ఐశ్వర్య (2006) సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. అలా మొదలైన ఆమె కెరీర్ ఆ తర్వాత బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ వరకు వచ్చింది. బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్‌తో నటించిన తన తొలి సినిమాకు ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోని దీపికా ఇప్పుడు రూ.500 కోట్ల నెట్ వర్త్ సంపాదించిందట. ఈమె సినిమాలు, పలు రకాల యాడ్ల ద్వారా సంపాదించించడంతో పాటు ఇతర వ్యాపారాల్లో కూడా ఇన్వెస్ట్ చేసి కోట్లు సంపాదిస్తోందట. మరి దీపిక చేస్తున్న ఆ వ్యాపారాలేంటో, ఆమె ఆదాయ మొత్తం ఎంతో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
1. ప్రొడక్షన్ హౌజ్ -కేఏ ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పీ పేరిట దీపికా పదుకొణె 2017లో ఓ కంపెనీ స్థాపించారు. ఆ తర్వాత కేఏ ప్రొడక్షన్స్ పేరిట ఒక ప్రొడక్షన్ హౌజ్ నెలకొల్పారు. మేఘనా గుల్జార్ బయోపిక్ డ్రామాను చపాక్(2020)గా తెరకెక్కించింది ఈ సంస్థనే. యాసిడ్ దాడి బాధితురాలు అయిన లక్ష్మీ అగర్వాల్ పాత్రను దీపికానే పోషించారు.
2. క్లాతింగ్ బిజినెస్ -కేఏ ప్రొడక్షన్స్ ఆరంభించడానికి ముందు క్లాతింగ్ లైన్లో అడుగుపెట్టిన దీపిక ప్రముఖ ఈ కామర్స్ సైట్ మింత్రాతో కలిసి 2015లో ఈ వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫ్యాషన్ అంటే తన దృష్టిలో "ఎటువంటి ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్ డ్రెస్ వేసుకోగలగడం. నేను వేసుకునే దుస్తులు నా వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఇంకా 18-35 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న మల్టీ టాస్కింగ్ మహిళల గురించి చాటి చెప్తాయి" అని వివరించారు.
దీపికకు సినిమాలే కాదు, అందులోనూ ఫుల్ ఇన్కమ్ - ఆమె నెట్‌వర్త్ ఎన్ని వందల కోట్లంటే? - Deepika padukone Net worth - DEEPIKA PADUKONE NET WORTH
Deepika Padukone Net worth Business : బాలీవుడ్ రిచెస్ట్ హీరోయిన్స్‌లో దీపికా పదుకొణె ఒకరు. అయితే ఈ భామ కేవలం సినిమాలు, యాడ్లతో మాత్రమే కాకుండా వేరు వేరు వ్యాపారాల్లోనూ కోట్ల రూపాయలను ఇన్వెస్ట్మెంట్ చేసి సంపాదిస్తోంది. ఇంతకీ ఆమె నెట్ వర్త్ ఎంత? ఆమె ఏఏ వ్యాపారాలను చేస్తోంది? వంటి వివరాలను తెలుసుకుందాం.
Deepika Padukone Net Worth (source Getty Images)
Published : Sep 11, 2024, 4:05 PM IST
4. ఫర్లెన్కో-2019వ సంవత్సరం ఫర్నిచర్ రెంటల్ ప్లాట్‌ఫామ్ అయిన ఫర్లెంకోలో ఇన్వెస్ట్ చేశారు దీపికా.
5. పర్పుల్ -ఫర్లెంకో మాత్రమే కాదు ఆన్ లైన్ బ్యూటీ ప్రొడక్ట్స్ మార్కెట్ ప్లేస్ అయిన పర్పుల్‌లో కూడా ఇన్వెస్ట్ చేశారు దీపిక. అది కూడా 2019లోనే.
6. ఎపిగేమియా -2019లోనే ముంబయి బేస్డ్ ప్యాకేజ్డ్ ఫుడ్ స్టార్టప్ అయిన డ్రమ్ ఫుడ్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిశారు. ఎపిగేమియా అనే యోగర్ట్ బ్రాండ్‌లో భాగస్వామ్యమయ్యారు. అడ్వర్టైజ్మెంట్ చేశారు. 7.బెల్లాట్రిక్స్ ఎరోస్పేస్ -బెంగళూరు బేస్డ్ స్పేస్ టెక్ స్టార్టప్ అయిన బెల్లాట్రిక్ ఎరోస్పేస్ కోసం రూ.21కోట్లు వెచ్చించి 2019లో ఇన్వెస్ట్ చేశారు దీపిక.
8. బ్లూస్మార్ట్ -ముంబయి, పుణె, హైదరాబాద్, దిల్లీలలో ఎలక్ట్రిక్ ట్యాక్సీ స్టార్టప్‌లోనూ పెట్టబడులు పెట్టారు.
9. మోకోబరా -2019లో ఐదు స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టిన దీపికా 2020లో ట్రావెలింగ్ బ్యాగ్స్ తయారుచేసే మోకోబరాలోనూ పెట్టుబడులు పెట్టారు.
10. ఆటంబర్గ్(Atomberg) టెక్నాలజీస్ -స్మార్ట్ ఫ్యాన్ మేకర్ అయిన ఆటంబర్గ్ టెక్నాలజీస్‌లోనూ పెట్టుబడులు పెట్టారు.
11. సూపర్ టైల్స్ -2021లో దీపికా పెట్ కేర్ ప్లాట్‌ఫామ్ అయిన సూపర్ టైల్స్‌లో కూడా పెట్టుబడులు పెట్టారు.
12. బ్లూ టోకై కాఫీ -తన సొంత బ్రాండ్లే కాకుండా 2023లో ఇతర వ్యాపార సంస్థలను ప్రోత్సహించేలా గురుగ్రామ్‌కు చెందిన బ్లూటోకైలో ఇన్వెస్ట్మెంట్ చేశారు దీపిక. స్టార్ హీరో లైనప్‌లో ఏకంగా 9 సినిమాలు - రూ.650 కోట్ల బడ్జెట్‌తో! - Big Budget Upcoming Movies