Deepika Padukone Special Gift : బీటౌన్ స్టార్ కపుల్ దీపికా పదుకుణె, రణ్‌వీర్ సింగ్ తాజాగా ఓ పండంటి ఆడబిడ్డకు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. అయితే ఈ స్పెషల్ మూమెంట్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు దీపికా ఓ ఖరీదైన గిఫ్ట్‌ను కొనుగోలు చేశారని సమాచారం. అయితే 17.8కోట్ల రూపాయల వరకూ ఉంటుందని సమాచారం. ఇంతకీ అదేంటంటే?
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కొద్ది రోజులకే దీపికాకు చెందిన కేఏ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీ ముంబయిలో ఓ ప్రాపర్టీని కొనుగోలు చేసిందట. ముంబయిలో ప్రముఖ సెలబ్రిటీలంతా ఉండే బాంద్రాలోని వెస్ట్ ప్రాంతంలో 1845 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్ కొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎనార్మ్ నాగ్ పాల్ రియాల్టీ సంస్థకు చెందిన సాగర్ రేషమ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో 15వ అంతస్తులో ఉన్న ఈ అపార్ట్‌మెంట్ విలువ రూ.17.8కోట్లు ఉంటుందని సమాచారం. ఇందుకోసం దీపికా రూ.1.07కోట్లు రూపాయలు స్టాంప్ డ్యూటీ, రూ.30,000 రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా చెల్లించారట. ఇంకో విషయం ఏంటంటే గతంలోనూ ఇదే రెసిడెన్షియల్ టవర్లో దీపికా, రణ్‌వీర్ సింగ్‌లు క్వాడ్రూప్లెక్స్ కొనుగోలు చేశారట.
రణ్‌వీర్ - దీపికాల ముంబయిలోని లగ్జరీ ఇళ్ల వివరాలు ఇవే :
సీ ఫేసింగ్ క్వాడ్రూప్లెక్స్ హౌస్
షారుక్ ఖాన్ విలాసవంతమైన 'మన్నత్'కు సమీపంలోని బాంద్రా బ్యాండ్ స్టాండ్‌లో దీపికా, రణ్‌వీర్ ఓ ఇంటిని కొనుగోలు చేశారట. సాగర్ రేషమ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలోని 16, 17, 18,19 ఫ్లోర్లలో ఇది ఉంటుందట. దీని టెర్రస్ ఏరియానే 1300 చదరపు అడుగులని సమాచారం. అంతేకాకుండా 19 కార్లు పార్కింగ్ చేసుకునే వెసలుబాటు కూడా ఉందట. దీని కోసం దాదాపు రూ.119 కోట్లు వెచ్చించి పెట్టి మరీ సీ ఫేసింగ్ క్వాడ్రూప్లెక్స్‌ను కొనుగోలు చేశారట.