Deepika Padukone Daughter Name : ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా దీపికా పదుకొణె- రణ్‌వీర్ సింగ్ తమ ముద్దుల తనయకు 'దువా పదుకొణె సింగ్' (Dua Padukone Singh) అని పేరు పెట్టినట్టు శుక్రవారం వెల్లడించారు. అమె తమ ప్రార్థనలకు సమాధానమంటూ దీపికా పోస్ట్ చేసింది. దువా అంటే ప్రార్థన అని, తమ ప్రేయర్స్‌కు సమాధానమే ఈమె అని పేర్కొంటూ చిన్నారి కాళ్లను ఫొటో తీసి షేర్ చేసుకున్నారు. దీనిపై అభిమానులతో పాటు అలియా భట్, మమితా బైజు, షాలినీ పాండే తదితర సినీ ప్రముఖులు స్పందించారు. 'క్యూట్' అంటూ లవ్ ఎమోజీలు కామెంట్ చేశారు.
కుమార్తె పేరు రివీల్ చేసిన దీపికా పదుకొణె- సోషల్ మీడియాలో ఫస్ట్ ఫొటో పోస్ట్ - DEEPIKA PADUKONE DAUGHTER NAME
ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొణె తన కుమార్తెకు ఏం పేరు పెట్టిందో తెలుసా?
Deepika Padukone Daughter Name (Getty Images)
Published : Nov 1, 2024, 9:05 PM IST
|Updated : Nov 1, 2024, 10:12 PM IST
రణ్‌వీర్- దీపికా 2018లో వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో దీపికా పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చారు. దీపావళి పండగను పురస్కరించుకుని తొలిసారి చిన్నారి ఫొటోను పంచుకున్నారు. అంతేకాకుండా తమ కుమార్తె పేరునూ ప్రకటించారు. 'కల్కి 2898 ఏడీ'తో అలరించిన దీపికా 'సింగమ్ అగైన్'తో మరోసారి ఆడియన్స్ ముందుకొచ్చారు. ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఇందులో రణ్‌వీర్ అతిథి పాత్రలో నటించారు.
Last Updated : Nov 1, 2024, 10:12 PM IST