తెలంగాణ

telangana

పెద్ద పండుగలే టార్గెట్​ - దీపావళి రేసులో యంగ్ హీరో ఎంట్రీ - 2024 Deepavali Release Movies

By ETV Bharat Telugu Team

Published : Jul 18, 2024, 10:25 AM IST

Deepavali Speical Tollywood Release Movies : ఈ ఏడాది దీపావళి కానుకగా థియేటర్లలో సందడి చేయనున్న సినిమాల్లో ఓ యంగ్ హీరో మూవీ రేసులో ముందంజలో ఉంది ఇంతకీ ఆ చిత్రం ఏదంటే?

2024 Deepavali Release Movies
2024 Deepavali Release Movies (Getty Images, ETV Bharat)

Deepavali Speical Tollywood Release Movies : దసరా,దీపావళి లాంటి పెద్ద పండుగలను దృష్టిలో ఉంచుకుని రానున్న సీజన్​లో పలు భారీ బడ్జెట్​ సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఫెస్టివల్ స్పెషల్స్​గా ఆయా చిత్రాలు థియేటర్లలోకి వచ్చేందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. అందులో 'దేవర', 'కంగువ'పై అభిమనుల్లో భారీ ఆశలే నెలకొన్నాయి. ఈ రెండూ కూడా భారీ తారాగణంతో రానున్న నేపథ్యంలోల బాక్సాఫీస్ వద్ద గటి పోటీ నెలకొననుంది.

అయితే అంతకంటే ముందే ఆగస్టు 15న 'సరిపోదా శనివారం' సినిమా తమ రిలీజ్ డేట్​ను ఫిక్స్ చేసుకున్నాయి. కానీ ఇదే తేదీన అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' రావాల్సి ఉండగా, అది కాస్త డిసంబర్​కు వాయిదా పడింది. దీంతో '#35', 'మిస్టర్ బచ్చన్', 'డబుల్ ఇస్మార్ట్', 'ఆయ్', లాంటి మీడియం సినిమాలు బాక్సాఫీస్​ వద్ద సందడి చేయనున్నాయి. ఇవన్నీ కూడా వేర్వేరు జానర్లలో రూపొంది మూవీ లవర్స్​కు ఓ కొత్త అనుభవాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక వినాయాక చవితికి విజయ్ దళపతి 'ది గ్రేటెస్ట్ ఆఫ్​ ఆల్​ టైమ్​', దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' పోటీపడనున్నాయి.

ఇదిలా ఉండగా, వెలుగుల పండుగ దీపావళికి ఇంకా ఏటువంటి స్లాట్ బుక్ అవ్వలేదని అనుకునేలోపే మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఎంట్రీ ఇచ్చారు. తన అప్​కమింగ్ మూవీ 'మెకానిక్ రాకీ'తో మాస్ ఆడియెన్స్​ను ఆకట్టుకోనున్నారు. దీపావళి కానుకగా ఈ చిత్రం అక్టోబర్​ 31న విడుదల కానున్నట్లు మేకర్స్ తాజాగా కన్ఫార్మ్​ చేశారు. ఇప్పటి వరకూ ఈ ఒక్క సినిమానే దీపావళి రేసులో ఉంది. ఇది కూడా ఓ పెద్ద పండుగ అయినందున మరిన్ని సినిమాలు ఈ తేదీన రిలీజయ్యే అవకాశాలున్నాయని సినీ పండితుల మాట.

ఆ స్టార్ హీరోతో మరోసారి క్లాష్​
ఇదిలా ఉండగా, సరిగ్గా అక్టోబర్ 31న శివకార్తికేయన్ 'అమరన్' మూవీ రిలీజ్​కు సిద్ధం కానుంది. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మూవీ లవర్స్​ను ఆకట్టుకుంటోంది. పైగా బయోపిక్ కావడం వల్ల ఆడియెన్స్ ఈ చిత్రం వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో టాలీవుడ్​లో 'మెకానిక్ రాకీ'కి గట్టి పోటీనే నెలకొననుంది.

OTTలోకి 9 మంది స్టార్​ హీరోలు కలిసి నటించిన సిరీస్​!- స్ట్రీమింగ్ ఎందులో అంటే? - Manorathangal OTT

'పరుగెత్తు- అతడు వస్తున్నాడు'- నాని సినిమా సాలిడ్ అప్డేట్

ABOUT THE AUTHOR

...view details