Celebraties Wishes Independence Day Greetings: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. దేశమంతా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సినీ తారలు సోషల్ మీడియా వేదికగా ఆడియెన్స్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, హనుమాన్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంక్ వర్మ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్విట్టర్లో పోస్ట్‌లు షేర్ చేశారు. ఇక ప్రభాస్ రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ 'కల్కి' మూవీ టీమ్ కూడా ఇండిపెండెన్స్ డే విషెస్ తెలిపింది.
- దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. దీని కోసం మన పూర్వీకులు ఎంతోమంది ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేశారు. వాళ్లందరినీ స్మరించుకుందాం. వారిని ఆదర్శంగా తీసుకుందాం. జైహింద్- చిరంజీవి
- అందరికీ 78వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు- జూనియర్ ఎన్టీఆర్
- ఈ ప్రపంచంలో ఉన్న భారతీయులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు- అల్లు అర్జున్
కల్కి స్పెషల్ పోస్టర్
రెబల్ స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన 'కల్కి ఏడీ 2898' గురువారానికి దిగ్విజయంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆడియెన్స్‌కు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. సినిమాను బ్లాక్‌బస్టర్ చేసినందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, జూన్ 27న రిలీజైన ఈ సినిమా అనేక రికార్డులు బద్దలుకొట్టి, వరల్డ్‌వైడ్‌గా రూ.1100+ కోట్ల వసూళ్లు సాధించింది.