Deepika Padukone Baby Bump Photos:బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె ప్రెగ్నెన్సీ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ను షేర్ చేస్తుంది. తాజాగా తన భర్త రణ్వీర్ సింగ్‌తో కలిసి బేబీ బంప్ ఫొటో షూట్లో పాల్గొంది. ఈ షూట్‌కు సంబంధించిన ఫొటోలు సోమవారం సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరికొన్ని వారాల్లోనే దీపికా- రణ్వీర్ తల్లిదండ్రులు కానున్నట్లు ఈ ఫొటోలు చూస్తే తెలుస్తోంది. ఈ సందర్భంగా సెలబ్రిటీలు, ఫ్యాన్స్ ఈ జంటకు కామెంట్ల రూపంలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా, 2024 ఫిబ్రవరిలో దీపిక తన ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసింది. అప్పటి నుంచి సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉంటూ వస్తోంది. అయితే రీసెంట్ బ్లాక్ బస్టర్ 'కల్కి AD 2898' ప్రమోషన్స్‌లో మాత్రం దీపికా బయటకు వచ్చింది. బేబీ బంప్‌తోనే సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంది. ఇటీవల ముంబయిలో గ్రాండ్‌గా జరిగిన వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లికి కూడా ఈ జంట హాజరై అట్రాక్షన్‌గా నిలిచింది.
బిడ్డ కోసం కీలక నిర్ణయం
తనకు పుట్టబోయే బిడ్డ కోసం దీపికా పదుకొణె ఓ కీలక నిర్ణయం తీసుకుందట. బిడ్డకు జన్మనిచ్చాక ఎక్కువ సమయం బేబీతోనే గడపాలని నిర్ణయం తీసుకుందని తెలిసింది. ఈ మధ్య కాలంలో చాలామంది సెలబ్రిటీలు పిల్లలను కేర్టేకర్స్కు అప్పగిస్తున్నారు. కానీ, తాను అలా చేయనని, తన బిడ్డ ఆలనాపాలనా మొత్తం స్వయంగా తానే చూసుకుంటానని చెప్పినట్లు బీ టౌన్లో వార్తలు వస్తున్నాయి.