Bigg Boss 8 Telugu Seventh Week Elimination: బిగ్‌బాస్ సీజన్8లో ఏడో వారం నామినేషన్ల రచ్చ మామూలుగా లేదు. ఇప్పటివరకు జరిగిన నామినేషన్స్ ఒక లెక్క.. ఈ ఏడో వారం జరిగిన నామినేషన్స్ మరో లెక్క అన్నట్టు ఉన్నాయి. ఎందుకంటే సోమవారం ఎపిసోడ్‌లో గౌతమ్-అవినాష్ మధ్య జరగిన గొడవ ఓ రకంగా ఉంటే.. మంగళవారం ఎపిసోడ్‌లో అవినాష్ - పృథ్వీ మధ్య జరిగిన గొడవ అయితే అంతకుమించి అనేలా ఉంది. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారో ఇప్పుడు చూద్దాం..
వారం రోజులు ఏం జరిగింది:సోమవారం, మంగళవారం రెండు రోజుల పాటు నామినేషన్లు జరగగా.. బుధవారం నుంచి ఓవర్ స్మార్ట్ టాస్క్ గేమ్‌ను కండక్ట్ చేశాడు బిగ్‌బాస్. ఇందులో రాయల్ క్లాన్ ఓవర్ స్మార్ట్ ఫోన్స్‌గా, ఓజీ క్లాన్ సభ్యులు ఓవర్ స్మార్ట్ ఛార్జర్‌గా గేమ్ ఆడారు. ఈ గేమ్‌లో ఇరు టీమ్స్ నుంచి చాలా గొడవలే జరిగాయి. టాస్కు ముగిసే సమయానికి ఓజీ క్లాన్ నుంచి ఔట్ కాకుండా ఉన్న విష్ణుప్రియ, యష్మీ, మణికంఠ, ప్రేరణ, రాయల్ క్లాన్ నుంచి అవినాష్, గౌతమ్, నయని, హరితేజ, మెహబూబ్, గౌతమ్, రోహిణి, గంగవ్వ, టేస్టీ తేజ.. మెగా చీఫ్ కంటెండర్స్‌గా ఎంపికయ్యారు. మెగా చీఫ్ టాస్క్ అయిన 'పట్టుకో లేదా తప్పుకో'లో భాగంగా సర్కిల్‌లో ఉన్న బోన్ (ఎముక బొక్క)ను ముందుగా పట్టుకొన్న వాళ్లు మెగా చీఫ్ పదవికి అర్హత లేని వారిని తప్పించొచ్చు.. ఇలా ప్రతిసారి ముందుగా బోన్‌ను పట్టుకున్న వాళ్లు ఇద్దరు సభ్యుల్ని కారణాలు చెప్పి రేసు నుంచి తప్పించాల్సి ఉంటుంది అని బిగ్‌బాస్ చెప్పాడు. ఇలా చివరి వరకు మిగిలిన గౌతమ్ మెగా చీఫ్ అయ్యాడు.
సీజన్ 8లో ఏడో వారం జరిగిన నామినేషన్ల ప్రక్రియలో తొలిసారిగా తొమ్మిది మంది నామినేట్ అయ్యారు. వాళ్లు.. గౌతమ్, పృథ్వీ, నిఖిల్, మణికంఠ, యష్మీ, తేజ, నబీల్, ప్రేరణ, హరితేజ. ఇక ఈ వారం నామినేషన్లు రెండు రోజులు జరిగాయి. దీంతో ఓటింగ్ ప్రాసెస్ మంగళవారం రాత్రి నుంచి ప్రారంభమయ్యి శుక్రవారం రాత్రి ఎండ్ అయ్యింది. ఇక అన్అఫీషియల్ లెక్కలు చూస్తే నిఖిల్ మొదటి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆ తర్వాతి స్థానంలో నబీల్, మణికంఠ మూడో స్థానంలో ఉన్నారని తెలుస్తోంది. ఇక ఆ తర్వాతి స్థానాల్లో ప్రేరణ, యష్మీ, ప్రస్తుత మెగా చీఫ్ గౌతమ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చివరి మూడు స్థానాల్లో హరితేజ,పృథ్వీ, టేస్టీ తేజ ఉన్నట్లు సమాచారం.