Balakrishna Prithvi Raj Movie : గతేడాది 'సలార్' సినిమాతో మంచి క్రేజ్ సంపాందించుకున్నారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్. మాలీవుడ్‌లో ఓ డైరెక్టర్‌గా, ఓ మంచి నటుడిగా ఎదిగిన ఆయన ప్రస్తుతం పాన్ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవలే ఆయన 'గోట్ లైఫ్' (ఆడు జీవితం) అనే సినిమాలో నటించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆయన మూవీ టీమ్‌తో కలిసి ప్రమోషనల్ ఈవెంట్స్‌లో సందడి చేశారు. అలా ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి పలు విషయాలు చెప్పిన ఆయన, బాలయ్య ఫ్యాన్స్‌కు ఓ స్వీట్ న్యూస్ అందించారు.
తెలుగులో మీరు ఏ యాక్టర్ సినిమాకు డైరెక్టర్‌గా వ్యవహరించాలనుకుంటున్నారు అంటూ యాంకర్ ప్రశ్న అడగ్గా, మొదట తన కోస్టార్ ప్రభాస్ పేరు చెప్పి, ఆ తర్వాత నటసింహం బాలకృష్ణ పేరు చెప్పారు పృథ్వీ. "బాలకృష్ణ సర్ ని కమర్షియల్ సినిమాలలో చూడటం మామూలే కాని రియల్ ఫిల్మ్‌లో చూడాలని ఉంది అంటే నిజమైన మలయాళ కమర్షియల్ సినిమాలో చూడాలని ఉంది" అంటూ తన మనసులోని మాట్ చెప్పేశారు పృథ్వీ. ఇది విన్న బాలయ్య ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాంబోలో ఓ సాలిడ్ సినిమా త్వరలో చూడాలనుకుంటున్నామంటూ కామెంట్లు పెడుతున్నారు.
'బాలయ్యతో సినిమా చేయాలని ఉంది - ఆయన్ను అలా చూడాలని నా కోరిక' - Balakrishna Prithvi Raj Movie - BALAKRISHNA PRITHVI RAJ MOVIE
Balakrishna Prithvi Raj Movie : 'సలార్' సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన పృథ్వీ రాజ్ ఇప్పుడు 'గోట్ లైఫ్'తో మరోసారి తెలుగు తెరపై కనిపించనున్నారు. ఈ సంధర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్నారు.
Balakrishna Prithvi Raj Movie
Published : Mar 27, 2024, 8:19 PM IST