Balakrishna NBK 109 Villain Bobby Deol : నందమూరి బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) డైరక్షన్లో ముస్తాబవుతున్న సినిమా NBK 109. భగవంత్ కేసరి తర్వాత బాలయ్య బాబు ఫ్యాన్స్ ఈ సినిమా గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా సినిమా గురించి కీలక అప్‌డేట్‌ను అనౌన్స్ చేసింది మూవీ యూనిట్. ముందుగా చెప్పినట్లుగానే సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్న బాబీ దేఓల్ సెట్లోకి అడుగుపెట్టినట్లు ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. "వేటగాడొచ్చేశాడు #NBK109 సెట్స్‌లో అడుగుపెట్టిన స్వాగ్ స్టార్ బాబీ దేఓల్ గారికి స్వాగతం. మా టీంకి ఎక్స్ ట్రా డోస్ ఎనర్జీని ఇచ్చారు" అంటూ క్యాప్షన్ రాసి పోస్టు పెట్టింది. ఈ ఫొటోలో డైరక్టర్ బాబీతో పాటు నిర్మాత నాగ వంశీ కూడా ఉన్నారు.
బాలయ్యను ఢీ కొట్టేందుకు సెట్లోకి అడుగుపెట్టేసిన హంటర్ - NBK 109 Villain - NBK 109 VILLAIN
Balakrishna NBK 109 Villain Bobby Deol : ఎన్బీకే 109 సెట్స్‌లోకి అడుగుపెట్టారు బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ దేఓల్. ఈ విషయాన్ని తెలుపుతూ మువీటీమ్ ఆయన ఫొటోను షేర్ చేసింది.
Published : Apr 23, 2024, 4:53 PM IST
|Updated : Apr 23, 2024, 5:56 PM IST
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి శివరాత్రి రోజున విడుదల చేసిన బాలకృష్ణ గ్లింప్స్ నందమూరి ఫ్యాన్స్‌కు మంచి ఊపునిచ్చింది. అందులో "సింహం నక్కల మీదకొస్తే వార్ అవదురా లఫూట్. ఇట్స్ కాల్డ్ హంటింగ్" అంటూ బాలయ్య చెప్పే డైలాగ్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇప్పటివరకూ టైటిల్ అనౌన్స్‌మెంట్ లేకపోయినా #NBK109 అనే వర్కింగ్ టైటిల్‌తోనే షూటింగ్ పనులు జరుపుతున్నారు. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా సితారా ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సినిమాను తెరకెక్కిస్తున్నారు. సంగీతం తమన్ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ విజయ్ కార్తీక్ కణ్నన్, ఎడిటింగ్ నిరంజన్ దేవరమణె చేస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తుంది. మిగిలిన తారాగణం, సినిమా టైటిల్ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజీ అయిపోయిన బాలకృష్ణ అతి త్వరలోనే షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం. ముందుగా మిగిలిన పాత్రల సీన్లను షూట్ చేసి బాలయ్యపై చిత్రీకరణను తర్వాత పూర్తి చేస్తారని తెలుస్తోంది.
ప్రశాంత్ వర్మ సూపర్ అప్డేట్ - డ్రాగన్‌తో జై హనుమాన్ పోరాటం! - Prasanth Varma Jai hanuman