Ashmit Patel Movie Career: మూవీ ఇండస్ట్రీలో ప్రారంభంలోనే సూపర్ క్రేజ్ సొంతం చేసుకుని, అనుకోని సమస్యలతో కెరీర్ పోగొట్టుకున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. 2000 సంవత్సరం ప్రారంభంలో బాలీవుడ్ ఇండస్ట్రీ కొత్త జోష్‌లో ఉంది. హాలీవుడ్ స్ఫూర్తితో ఊహించని ట్విస్ట్‌లతో సినిమాలు రూపొందాయి. కొత్త నటీనటులు ఇండస్ట్రీపై పెద్ద ప్రభావం చూపారు. ఆ సమయంలో సినిమాల్లోకి అడుగుపెట్టిన వారిలో అష్మిత్ పటేల్ కూడా ఉన్నారు. ఆయన చాలా త్వరగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఓనర్‌నైట్ స్టార్‌డమ్ సొంతం చేసుకున్నారు.
అష్మిత్ యాక్ట్ చేసిన రెండో సినిమా ఆ సంవత్సరంలోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అయితే ఊహించని ఘటనతో అతడి కెరీర్ ముగిసిపోయింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ నటించిన జై హో సినిమాతో మళ్లీ తెరపైకి వచ్చారు. ప్రస్తుతం అష్మిత్ పటేల్ ఒక ప్రొఫెషనల్ డీజేగా పని చేస్తున్నారు. పాపులర్ హీరోయిన్ అమీషా పటేల్ సోదరుడు అయిన అష్మిత్ కెరీర్‌కి సంబంధించిన ఆస్తికర అంశాలు ఇప్పుడు చూద్దాం.
బాలీవుడ్‌లో బిగ్ బ్రేక్
అష్మిత్ పటేల్ యాక్టింగ్‌లోకి రాకముందు అసిస్టెంట్ డైరెక్టర్ (AD)గా పనిచేశారు. అతను 'రాజ్', 'ఆవారా పాగల్ దీవానా', 'ఆప్ ముజే అచ్చే లగ్నే లగే' వంటి పాపులర్ సినిమాలకు పని చేశారు. మొదట 2003లో 'ఇంతేహా' అనే మూవీలో విద్యా మాలవాడే, నౌహీద్ సైరూసితో కలిసి నటించారు. తర్వాత 2004లో అనురాగ్ బసు దర్శకత్వం వహించిన 'మర్డర్'లో కనిపించారు. ఈ మూవీలో చేసిన పాత్ర ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.25 కోట్లు వసూలు చేసి హిట్‌గా నిలిచింది. ఈ సంచలన విజయానికి మల్లికా షెరావత్, ఇమ్రాన్ హష్మీ నటించిన బోల్డ్ సీన్‌లే కారణమని చెప్పవచ్చు. దీని తర్వాత అష్మిత్‌కు వరుసగా ఆఫర్‌లు వచ్చాయి. 'నాజర్', 'సిల్సిలే', 'ఫైట్ క్లబ్', 'బనారస్', 'దిల్ దియా హై', 'కుడియోన్ కా హై జమానా' సహా అనేక మూవీల్లో నటించారు.