తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

హీరోయిన్ అనుష్క ప్రతీకారం - Anushka Shetty Ghati movie

Anushka Shetty Director Krish Movie : ఆ మధ్య మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టితో పలకరించిన హీరోయిన్ అనుష్క శెట్టి కొత్త సినిమా అనౌన్స్​మెంట్ వచ్చేసింది. ఆ వివరాలు.

హీరోయిన్ అనుష్క ప్రతీకరం
హీరోయిన్ అనుష్క ప్రతీకరం

By ETV Bharat Telugu Team

Published : Mar 20, 2024, 10:11 AM IST

Updated : Mar 20, 2024, 11:19 AM IST

Anushka Shetty Director Krish Movie : హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అందం అభినయం ఉన్న అతి కొద్దిమంది నటీమణులలో ఈమె ఒకరు. లేడీ ఓరియెంటెడ్​ చిత్రాలకు భారీ మార్కెట్ క్రియేట్ చేసిన నటి. అయితే గత కొన్నేళ్లుగా సినిమాలు చేయడం తగ్గించేసిన అనుష్క ఇప్పుడు తన కెరీర్​లో మైలురాయి 50వ చిత్రానికి చేరువైంది. రీసెంట్​గా మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి చిత్రంతో మంచి హిట్ అందుకున్న ఈమె ప్రస్తుతం తన కొత్త సినిమా కోసం రెడీ అయింది.

దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడితో కలిసి ఓ చిత్రం చేస్తోంది. యూవీ క్రియేషన్స్​, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వంశీకృష్ణా రెడ్డి, రాజీవ్‌ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. లేడీ ఓరియెంటెండ్​గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఘాటి అనే టైటిల్​ను ఖరారు చేశారు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ముంబయిలో నిర్వహించిన ఓ ఈవెంట్​లో ఈ సినిమా పేరును, ప్రీ లుక్‌ను రిలీజ్ చేసి సర్​ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. వ్యాపార రంగంలో అంచలంచలుగా ఎదుగుతున్న ఓ మహిళను కొందరు స్వార్థంతో కావాలని ఎలా నష్టపరిచారు? ఆమె నేరస్థురాలిగా ఎందుకు మారింది? ఆ తర్వాత ఆమె వారిపై ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంది? అనేదే ఈ సినిమా కథాంశం అని తెలుస్తోంది. ప్రతీకారం ప్రధానంగా సాగే ఈ కథ కచ్చితంగా విజయం సాధిస్తుందని మేకర్స్​ అంటున్నారు. మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి తర్వాత అనుష్క నటిస్తున్న చిత్రమిది. ఈ చిత్రానికి చింతకింది శ్రీనివాస్‌రావు, క్రిష్‌, బుర్రా సాయిమాధవ్‌ రచన చేశారు.

Anushka Shetty Malayalam Movie :ఇకపోతే అనుష్క శెట్టి మాలీవుడ్ ఇండస్ట్రీలోన అడుగు పెట్టేందుకు రెడీ అయింది. ప్రస్తుతం అక్కడ కథనార్ - ది వైల్డ్ సోర్సెరర్ అనే పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ చేస్తోంది. ఇది ఆమె కెరీర్​లో 49వ చిత్రం. రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్నారు.

సిటాడెల్​ - స్టన్నింగ్​ లుక్స్​తో హీట్ పెంచిన సమంత

RRR సీక్వెల్​పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్​!

Last Updated : Mar 20, 2024, 11:19 AM IST

ABOUT THE AUTHOR

...view details