తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'సిద్ధుతో యాక్ట్ చేయడం నాకిష్టం లేదు - ఆ విషయంలో అతడిపై కోపమొచ్చింది' - Anupama Parameswaran Tillu Square - ANUPAMA PARAMESWARAN TILLU SQUARE

Anupama Parameswaran Tillu Square : 'ఈగల్' సినిమాలో కనిపించి ప్రేక్షకులను మెప్పించిన మల్లు బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఈ సారి లిల్లీగా అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. అయితే ఇటీవలే విడుదలైన ట్రైలర్​లో ఆమె కాస్త బోల్డ్​గా కనిపించి అందరినీ షాక్​కు గురి చేసింది. తాజాగా ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో స్పందించింది.

Anupama Parameswaran Tillu Square
Anupama Parameswaran Tillu Square

By ETV Bharat Telugu Team

Published : Mar 26, 2024, 4:20 PM IST

Anupama Parameswaran Tillu Square :రింగుల జట్టు, క్యూట్ స్మైల్ -మల్లు బ్యూటి అనుపమ పరమేశ్వరన్ అంటే అందరికి గుర్తొచ్చేది ఇదే. తన కొంటె చూపుతో ఎంతో మంది మనుసలను దోచేసింది ఈ చిన్నది. తొలి సినిమాతోనే భాషతో సంబంధం లేకుండా ఆడియెన్స్​ను ఆకట్టుకున్న ఈ అమ్మడు వరుసగా కోలీవుడ్, టాలీవుడ్​లోనూ మంచి పేరు సంపాదించుకుంది. ఇటీవలే రవితేజ 'ఈగల్​' సినిమాలో కీలక పాత్ర పోషించింది. త్వరలో 'టిల్లు స్క్వేర్​'తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.

అయితే ఈ అమ్మడు ఇప్పటి వరకు స్కిన్​ షోకు దూరంగా ఉన్నట్లు కనిపించింది. కానీ ఈ మూవీ ట్రైలర్​లో ఆమె బోల్డ్​ లుక్స్ చూసి అందరూ షాకయ్యారు. ఇది మన అనుపమనేనా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ట్రైలర్​తో పాటు సాంగ్స్​లోనూ కొంచం బోల్డ్​గానే కనిపించారు. అయితే ఈ విషయం గురించి తాగా ఈ చిన్నది ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. అంతే కాకుండా ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

'టిల్లూ 2' లో నటించడం తనకు అస్సలు నచ్చలేదని, సిద్దూ తెగ ఇబ్బందిపెట్టేవాడని తెలిపింది. కొద్దిరోజులకు సిద్దూ చేసే చేష్టలకు తనకు ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఒప్పుకున్నానా అనిపించిందట. క్యారవాన్‌లో నుంచి బయటకు రాగానే హాయ్ చెప్పడం, విష్ చేయడం లాంటి ఫార్మాలిటీస్ ఉండేవి కావట. సడెన్‌గా వచ్చేసి కాటుక కాస్త చిన్నగా ఉంది. పెద్దగా ఉండాలి. ఈ సీన్ ఇంకా బాగా చేసి ఉండాలంటూ సూచనలిచ్చేవాడట. అవన్నీ చూసి మా మేనేజర్ కు ఫోన్ చేసి అసలు ఇతనికి నేనేంటో తెలుసా నా యాక్టింగ్ గురించి తెలిసే మాట్లాడుతున్నాడా అని తిట్టేశానని అనుపమ చెప్పింది. అలా షూటింగ్ స్టార్ట్ చేసిన కొద్ది రోజులకు పనిలో పడి అతను ఇంతేనని అలవాటు పడిపోయానని చెప్పారు అనుపమ.

మరోవైపు తన గ్లామర్​ షో గురించి కూడా ఈ ప్రమోషన్స్​లో స్పందించింది. " స్క్రీన్‌పై ఒక అమ్మాయి హాట్‌గా కనిపించడం ఎంత కష్టమో నాకు ఈ సినిమా చేశాత అర్థమైంది. ఇది చూసిన వాళ్లందరూ గ్లామర్‌గా ఉండే పాత్రలు చేస్తుందంటూ సింపుల్‌గా కామెంట్స్‌ చేస్తారు. అయితే నా దృష్టిలో మాత్రం అలాంటి వాటిని చేయడం చాలా ఇబ్బంది. కొన్ని కాస్ట్యూమ్స్‌ స్క్రీన్‌పై చూడటానికి కలర్‌ఫుల్‌గా ఉంటాయి. కానీ, అవి వేసుకుని ఆ హీరోయిన్ సెట్‌లో అంతమంది ఎదుట ఉండాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో మాకు మాత్రమే తెలుస్తుంది. మరికొన్ని కాస్ట్యూమ్స్‌కు అయితే మొత్తం అద్దాలతో చేసిన వర్క్‌ మాత్రమే ఉంటుంది. అవన్ని అప్పుడప్పుడు గీసుకుపోతుంటాయి. ఇవన్నీ భరిస్తేనే వాళ్లు0 గ్లామర్‌గా కనిపిస్తారు. ఇలాంటి ఇబ్బందులు పడుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న హీరోయిన్లను కచ్చితంగా మెచ్చుకోవాలి." అంటూ హీరోయిన్ల కష్టాలతో పాటు తన అనుభవాలను పంచుకుంది.

అనుపమ గ్లామర్ అంటే ఆ మాత్రం రేట్ ఉంటది - డీజే టిల్లు కోసం అన్ని కోట్లా!

ఫుల్​ స్వింగ్​లో అనుపమ - పాన్ఇండియా స్టార్ అయినా ఆ సినిమాల్లో ఛాన్స్ రాలేదు!

ABOUT THE AUTHOR

...view details