Pushpa Couple Song:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- రష్మిక మంధన్నా లీడ్ రోల్స్‌లో నటిస్తున్న 'పుష్ప- 2' నుంచి రెండో పాట రిలీజైంది. 'కపుల్ సాంగ్' పేరుతో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ పాట బుధవారం రీలీజైంది. 'సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి' అనే లిరిక్స్‌కు స్టైలిష్ కాస్ట్యూమ్‌లో పుష్పరాజ్‌తో కలిసి శ్రీవల్లి స్టెప్పులేసింది. 'పుష్ప- 2' ప్రారంభమైనప్పటి నుంచి కేవలం రెండు పోస్టర్లు తప్ప రష్మిక గురించి ఎలాంటి ఎప్డేట్ రాలేదు. ఇక ఈ పాటతో రష్మిక ఫ్యాన్స్‌కు మూవీటీమ్ ట్రీట్ ఇచ్చినట్లైంది.
కాగా, పుష్ప టైటిల్ సాంగ్ రాసిన రైటర్ చంద్రబోస్ ఈ పాటకు కూడా లిరిక్స్ అందించారు. టాప్ సింగర్ శ్రేయా ఘోషల్ స్వరం పాటకు ప్లస్ అయ్యింది. 'తగ్గేదేలే' మేనరిజంతో సింపుల్ స్టేప్స్తో బన్ని, రష్మిక డ్యాన్స్ అదరగొట్టారు. తొలి పార్ట్‌లో రష్మికను కాస్త డీగ్లామర్‌గా చూపిన డైరెక్టర్ సుకుమార్ ఈపాటలో స్టైలిష్‌లుక్‌లో చూపించారు. ఇక పాట రిలీజైన గంటలోపే 5 లక్ష్యల వ్యూస్ దాటడం విశేషం. కాగా, ఇటీవల రిలీజైన టైటిల్ సాంగ్ 'పుష్ప పుష్ప'కు కూడా భారీ రెస్పాన్స్ లభించింది.