Allu Arjun Fan Cycled 1600 kms :ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు 'పుష్ప' సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. నార్త్‌లో ఆయన డైలాగ్స్, డ్యాన్స్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ముఖ్యంగా పుష్ప మూవీలోని 'తగ్గేదేలే' డైలాగ్ మేనరిజానికి అక్కడి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అలా ఆయన నటన, డ్యాన్స్, డైలాగ్స్‌కు అభిమాని అయిన ఓ వ్యక్తి, బన్నీని కలిసేందుకు ఏకంగా 1600 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వచ్చాడు.
ఉత్తర్‌ప్రదేశ్ అలీగఢ్‌కు చెందిన బన్నీ ఫ్యాన్ ఒకరు ఆయన్ను కలిసేందుకు సైకిల్‌పై హైదరాబాద్ వచ్చారు. దాదాపు 1600 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన ఫ్యాన్‌ను బన్నీ కలిశారు. బన్నీ టీమ్ ఆ అభిమానికి స్వాగతం పలికారు. అతడు సైకిల్‌పై వచ్చాడని తెలుసుకున్న బన్నీ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇక అభిమానితో అల్లు అర్జున్ కాసేపు ముచ్చటించారు. 'పుష్ప - 2' సినిమా ప్రమోషన్స్‌కు ఉత్తర్ ప్రదేశ్ వచ్చినప్పుడు అతడిని తప్పకుండా కలుస్తానని అన్నారు. దీంతో అతడు ఫుల్ హ్యాపీ ఫీలయ్యాడు.
సేఫ్‌గా ఇంటికి తిరిగి వెళ్లాలని అతడికి బన్నీ సూచించారు. రిటర్న్‌లో సైకిల్‌పై కాకుండా ఫ్లైట్‌లో వెళ్లేలా ఏర్పాటు చేయాలని తన టీమ్‌ను బన్నీ ఆదేశించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్‌కు తన ఫ్యాన్స్ పట్ల ఎంతో ప్రేమ ఉంటుందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.