Kannappa Movie Akshay Kumar: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న చిత్రం 'కన్నప్ప'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నార్త్ టు సౌత్ వరకు పలువురు స్టార్స్ భాగం అవుతున్నారు. 'మహాభారత్' సిరీస్ తెరకెక్కించిన ముఖేశ్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రీతి ముకుందన్ హీరోయిన్గా నటిస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ సినిమాలో శివుడి పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన లుక్ పరిచయం చేస్తూ చిత్రబృందం కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో త్రిశూలం, డమరకంతో అక్షయ్ గంభీరంగా కనిపించారు. దీంతో శివయ్య లుక్‌లో అక్షయ్ అదిరిపోయారని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
తాజా పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. 'ముల్లోకాలు ఏలే పరమేశ్వకుడు, భక్తికి మాత్రం దాసుడు' అంటూ పోస్టర్‌పై రాసుకొచ్చారు. ఇక పోస్టర్లో అక్షయ్ శివతాండవం ఆడుతున్నట్టుగా కనిపిస్తున్నారు. త్రిశూలం, నీలకంఠం, ఢమరుకం ఇలా అన్నీ కూడా హైలెట్ అవుతున్నాయి. ఇక గత వారం కాజల్ అగర్వాల్ పాత్రకు సంబంధించిన లుక్ రిలీజ్ చేసింది చిత్రబృందం. పార్వతీ దేవీగా కాజల్‌ను చూపించారు. ఇప్పుడు అక్షయ్ కుమార్ పాత్రకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ పరమేశ్వరుడి పాత్రలో కనిపించనున్నారు