తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సమాజానికి ఉపయోగపడేలా 'అఖండ 2' తీయాలనుకుంటున్నాను : బోయపాటి - Akhanda 2 Storyline - AKHANDA 2 STORYLINE

Akhanda 2 Storyline : 'అఖండ' మాసివ్ సక్సెస్​ తర్వాత ఈ సినిమాకు సీక్వెల్​ ఉన్నట్లు పలు వార్తలు నెట్టింట హల్​చల్ చేశాయి. ఈ విషయంపై స్టార్ డైరెక్టర్ బోయపాటి శీను స్పందించారు. అంతే కాకుండా ఈ సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు.

Akhanda 2 Storyline
Akhanda 2 Storyline

By ETV Bharat Telugu Team

Published : Apr 16, 2024, 9:56 AM IST

Updated : Apr 16, 2024, 10:06 AM IST

Akhanda 2 Storyline : స్టార్ డైరెక్టర్ బోయపాటి శీను ఇటీవలే 'స్కంద' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆ తర్వాత ఆయన ఎటువంటి ప్రాజెక్ట్​ను అనౌన్స్ చేయలేదు. గతంలో 'అఖండ 2' సినిమాను తెరకెక్కించే ప్లాన్స్​లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. అయినప్పటికీ ఈ సినిమా గురించి ఎటువంటి అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ కూడా రాలేదు. అయితే తాజాగా ఈ విషయంపై డైరెక్టర్ స్పందించారు. 'అఖండ 2' గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడారు.

'అఖండ 2' ప్రస్తుతం స్క్రిప్టింగ్ దశలో ఉందని ఇందులోనూ తొలి భాగంలాగే పలు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నట్లు డైరెక్టర్ వెల్లడించారు. అయితే ఎన్నికలు తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటిస్తానంటూ తెలిపారు.

"అఖండ 1 ఎలా ఉందో అలాగే ఈ రెండో భాగంలోనూ పలు ఆసక్తికరమైన అంశాలు ఉంటాయి. అఖండలో, కథ చిన్నపిల్ల, ప్రకృతి, అలాగే దేవుని చుట్టూ తిరుగుతుంది. అదేవిధంగా అఖండ 2లోనూ ఉంటుంది. కానీ ఈ సారి నేను సమాజానికి ఉపయోగపడేలా ఎలిమెంట్స్ ఉండేలా రూపొందిస్తున్నాను" అంటూ బోయపాటి శ్రీను అన్నారు.

మరోవైపు బోయపాటి శ్రీనుతో గీతా ఆర్ట్స్‌ బ్యానర్​పై ఓ సినిమా చేయనున్నట్లు ఆ సంస్థ అఫీషియల్​గా అనౌన్స్ చేసింది. కానీ హీరో ఎవరనే డీటేయిల్స్​ను మాత్రం చెప్పలేదు. మరోవైపు బోయపాటి అప్పటికే అల్లు అర్జున్‌, సూర్య(కోలివుడ్​) కోసం కథలను కూడా సిద్ధం చేసుకున్నట్టు ప్రచారం సాగింది. ఇప్పుడా కథానాయకులు ఇద్దరు ప్రస్తుతం టాలీవుడ్​లో ఇతర చిత్రాల షూటింగ్​లతో ఫుల్​ బిజీగా ఉన్నారు.

దీంతో 'అఖండ 2' పై అందరి దృష్టి పడింది. మరి ఈ కాంబోలో 'అఖండ 2'నే పట్టాలెక్కుతుందా లేక, వేరే కథతో సినిమా చేస్తారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. అయితే బాలయ్య ప్రస్తుతం బాబీ రూపొెందిస్తున్న NBK 109లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఇది షూటింగ్​ దశలో ఉంది. దీని తర్వాత బాలయ్య ఇప్పటికైతే ఎలాంటి సినిమాను ప్రకటించలేదు. కాబట్టి బోయపాటితో కలిసి అఖండ 2 కోసం పని చేసే అవకాశముందంటూ కూడా టాక్ వినిపిస్తోంది.

Boyapati Srinu Upcoming Movies : బోయపాటి లైనప్‌... మహేశ్​-సూర్యతో సినిమా.. ఎప్పుడంటే?

Skanda Trailer Launch : 'అఖండ 2' కన్ఫామ్​​.. 'జై బాలయ్య' ఎందుకు అంటారో చెప్పిన బోయపాటి

Last Updated : Apr 16, 2024, 10:06 AM IST

ABOUT THE AUTHOR

...view details