Adivi Sesh Upcoming Movies :థ్రిల్లింగ్ కంటెంట్‌తో ఆడియెన్స్‌ను అలరిస్తూ ఇండస్ట్రీలో హిట్లతో దూసుకెళ్తున్నారు టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్. ఈయన ఇప్పటివరకూ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ అందుకున్నవే. ఇటీవల 'హిట్ 2'తో పలకరించిన శేష్, ఇప్పుడు మరిన్ని ప్రాజెక్టులతో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే ఆయన తాజాగా తన అభిమానులకు ఓ సూపర్ అప్డేట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు.
2025 సంవత్సరంలో తనవి మూడు సినిమాలు విడుదల కానున్నట్లు తాజాగా శేష్ రివీల్ చేశారు. అయితే ఇప్పటికే ఈయన లైనప్‌లో 'గూఢచారి 2' తో పాటు డకాయిట్ సినిమాలు ఉండగా, ఈ మూడో ప్రాజెక్ట్ ఏమైయ్యుంటదా అని అభిమానులు తెగ ఆలోచిస్తున్నారు. ఇక మరికొందరేమో ఆయన 'హిట్ 3'లోనూ నటించనున్నారని బహుశా అదే తన మూడో సినిమా అయ్యుండచ్చని చర్చించుకుంటున్నారు.
2018లో విడుదలైన 'గూఢచారి' బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ అందుకోవడమే కాకుండా శేష్‌కు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దీంతో ఈ స్టార్ హీరో కూడా ఇటువంటి జానర్ సినిమాల్లో ఎక్కువగా కనిపించి అభిమానులను ఆకట్టుకుంటున్నారు. దీంతో 'గూఢచారి-2' మూవీ లవర్స్‌లో అంచనాలు పెంచేసింది. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ వీడియో, స్పెషల్ పోస్టర్స్‌లో శేష్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది.