Actress Who Charged Rs. 5 Crore For 50 Seconds AD : కొంత మంది స్టార్ హీరోయిన్లు తమ పరిధిని దాటి ఇతర భాష సినిమాల్లోనూ రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి డిమాండ్ కూడా బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా మన సౌత్ హీరోయిన్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇటీవలే సమంత బాలీవుడ్లో ఓ సిరీస్‌కు సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఇక నయనతార కూడా 'జవాన్' సినిమాతో బీటౌన్ ప్రేక్షకులను అలరించింది. ఇలా నటీమణులు తమ ట్యాలెంట్‌తో పాన్ ఇండియా లెవెల్లో దూసుకెళ్తున్నారు.
ఇక వారికున్న క్రేజ్‌తో కొన్ని సార్లు హీరోలకు దీటుగా భారీ పారితోషకాన్ని అందుకుంటున్నారు. ఎంతలా అంటే ఒక్క 50 సెకండ్ల అడ్వర్టైజ్‌మెంట్‌కు రూ.5 కోట్లు వసూలు చేసేంత. అప్పట్లో హీరోల పారితోషకం కంటే హీరోయిన్లకు వచ్చేది చాలా తక్కువ. కానీ రోజులు మారాయి. అందరూ కాకపోయిన కొందరు హీరోయిన్లు ఇండస్ట్రీ ద్వారా బాగానే వెనకేసుకుంటున్నారు. ఇదంతా బాలీవుడ్ వరకే అనుకుంటే మళ్లీ మీరు పొరపడ్డట్టే. ఎందుకంటే కరీనా కపూర్, కత్రినా కైఫ్, దీపికా పదుకొనెలు యాడ్‌ల కోసం తీసుకునే మొత్తంతో పోటీపడే హీరోయినల్లు ఇప్పుడు సౌత్ లోనూ ఉన్నారు. ఒకింత షాకింగ్ గా అనిపించినా మరోవైపు ఇది గర్వించదగ్గ అంశమే.
ఇంతకీ ఆమె ఎవరంటే ?
ఇప్పటికే మనం మాట్లాడుకునే హీరోయిన్ పేరు గురించి మీకొక ఐడియా వచ్చేసి ఉండాలి. ఇంకెవరోకాదు ఒక రీజనల్ న్యూస్ ఛానల్లో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఓవర్ ఆల్ ఇండియా మెచ్చుకునే అంత స్థాయికి ఎదిగిపోయిన నయనతార. పర్ఫెక్ట్ టైమింగ్‌తో పాటు అదే రేంజ్ యాక్టింగ్‌తో మెప్పించగలిగే ఈ భామే భారీ పారితోషకం వసూలు చేస్తున్నారట. తెలుగు ప్రేక్షకులకు 'చంద్రముఖి' సినిమాతో పరిచయమైన నయన్, తను యాక్ట్ చేసిన ప్రతి సినిమాలోనూ బెటర్ పర్‌ఫార్మెన్స్ కనబరుస్తూ నిన్న మొన్న ఇండస్ట్రీకి వచ్చిన యువ తారలకు ధీటుగా పోటీపడుతున్నరు. అందంతో పాటు చక్కటి అభినయంతో అభిమానులను కట్టిపడేస్తుంటుంది ఈ తార. అయితే సినిమాల్లోనే కాకుండా పలు యాడ్స్‌లోనూ మెరిసిందీ ఈ భామ.
ఈ నేపథ్యంలోనే ఓ ప్రముఖ సైటిలైట్ కేబుల్ సంస్థ కోసం చేసిన 50 సెకన్ల యాడ్‌కు ఆమె ఏకంగా రూ.5 కోట్లు అందుకున్నారు నయన్. పైగా ఈ యాడ్ షూటింగ్ జరిగింది కేవలం రెండు రోజులు మాత్రమే. తమిళం, తెలుగు, మళయాళం, కన్నడ భాషల్లో విడుదలైన ఈ అడ్వర్టైజ్‌మెంట్ తమ మార్కెట్ పెంచుతుందని భావించి ఆ సంస్థ కూడా ఏ మాత్రం వెనుకాడకుండా నయనతార అడిగిన మొత్తాన్ని ముట్టజెప్పారట. ఇండియా మొత్తం మార్కెట్ సంపాదించుకున్న నయనతార ప్రస్తుతం ఒక సినిమాలో నటించేందుకు రూ.10 కోట్లు తీసుకుంటుందని సమాచారం