Rashmika Husband :టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మంధన్నా ప్రస్తుతం 'పుష్ప 2' సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు 'గర్ల్‌ఫ్రెండ్' సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఆమె అప్పుడప్పుడూ ఇంటర్వ్యూల్లో పాల్గొంటారు. అలా తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ప్రేమ, రిలేషన్ గురించి మాట్లాడారు. తనకు ఎలాంటి లైఫ్ పార్ట్‌నర్ కావాలో చెప్పారు.
రష్మికకు తనలాంటి మనస్తత్వంమే ఉన్న భాగస్వామి కావాలట. తన జీవితంలోకి రాబోయే లైఫ్ పార్ట్‌నర్ ఆమెకు ప్రతీ దశలో తోడుండాలని అన్నారు. 'నా భాగస్వామి జీవితంలో ప్రతీ దశలో నాకు తోడుగా ఉండాలి. అన్ని వేళలా నాకు భద్రత ఇవ్వాలి. జీవితంలో కష్ట సమయంల్లో నాకు మద్ధతుగా నిలవాలి. కచ్చితంగా ఒకరిపై ఒకరికి గౌరవం ఉండి తీరాలి. నా పట్ల శ్రద్ధ వహించాలి. మంచి మనసు ఉండాలి. ఒకరిపై ఒకరు బాధ్యతగా ఉంటే జీవితమంతా కలిసి ఉండొచ్చు'అని తెలిపారు.
ఈ క్రమంలోనే ఆమె ప్రేమ గురించి కూడా మాట్లాడారు. 'జీవితంలో ప్రతి ఒక్కరికీ ఓ తోడు కావాలి. ప్రేమలో ఉండడం అంటే నా దృష్టిలో భాగస్వామిని కలిగి ఉండడమే. తోడు లేకపోతే జీవితానికి ప్రయోజనం ఉండదు. మన ఒడుదొడుకుల్లో మనతో ఉంటూ సపోర్ట్ చేసేవారు ఉండాలి' అని రష్మిక చెప్పారు.