Ajith Car Race :కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కొత్త ఏడాదిలో ప్రత్యేకమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. 'అజిత్ కుమార్ రేసింగ్' పేరుతో ఆయన ఇటీవల ఒక రేసింగ్ టీమ్‌ను ప్రకటించారు. ఇక అదే టీమ్‌తో తాజాగా దుబాయ్ వేదికగా జరుగుతోన్న '24హెచ్ దుబాయ్ కారు రేసింగ్'లో పాల్గొని విజయం అందుకున్నారు. హోరా హోరీగా జరిగిన ఈ పోటీల్లో ఆయన టీమ్ మూడో స్థానంలో నిలిచింది.
ఇక ఇటీవల యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్న ఆయన ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ రేస్‌లో పాల్గొనడంపై హర్షం వ్యక్తం చేస్తూ, ఆయన టీమ్ 'స్పిరిట్ ఆఫ్ రేస్' అనే అవార్డు అజిత్‌కు బహుకరించింది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక అజిత్‌కు పలువురు నటీనటులు, ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా, టాలీవుడ్ నటుడు అక్కినేని నాగచైతన్య కూడా అజిత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 'ఈ విజయంతో అందర్నీ గర్వపడేలా చేశారు. మీ జర్నీ, మీ విజయం సూపర్' అంటూ ట్విట్టర్లో పోస్ట్ షేర్ చేశారు.అయితే నాగచైతన్యకు కూడా బైక్, కార్ రేసింగ్ అంటే చాలా ఇష్టం. ఆయన గ్యారేజ్‌లో సూపర్ స్పోర్ట్స్ కార్లు ఉంటాయి. ఆయన కూడా అప్పుడప్పుడు రేసింగ్‌లో పాల్గొంటారు.